ఇండియా – పాకిస్తాన్ బార్డర్ లో గోపీచంద్

Monday,January 21,2019 - 05:59 by Z_CLU

గోపీచంద్ కొత్త సినిమా షూటింగ్ స్టార్ట్ అయింది. ఫస్ట్ షెడ్యూల్ లోనే యాక్షన్ ప్యాక్డ్ సీక్వెన్సెస్ ని ప్లాన్ చేసుకున్నారు మేకర్స్. ఇండియా- పాకిస్తాన్ బార్డర్ లోని జైసల్మేర్ లో, యాక్షన్ డైరెక్టర్ సెల్వన్ అధ్వర్యంలో ఈ భారీ ఫైట్ ని తెరకెక్కిస్తున్నారు.

యాభై రోజుల భారీ షెడ్యూల్ ని ఫిక్స్ చేసుకున్న మేకర్స్ వరసగా రాజస్థాన్, న్యూఢిల్లీ లో, సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను తెరకెక్కించనుంది టీమ్. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ స్పై థ్రిల్లర్ లో గోపీచంద్ ని కంప్లీట్ గా డిఫెరెంట్ డైమెన్షన్ లో ప్రెజెంట్ చేయనున్నారు మేకర్స్.

A.K. ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాకి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. రామబ్రహ్మం సుంకర ఈ సినిమాకి ప్రొడ్యూసర్. ఈ సినిమాని మే నెలలో రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు మేకర్స్. తిరు ఈ సినిమాకి డైరెక్టర్.