
నెక్స్ట్ నువ్వే
నటీనటులు : ఆది, వైభవి
ఇతర నటీనటులు : బ్రహ్మాజీ, రశ్మి గౌతమ్, హిమజ, L.B. శ్రీరామ్, శ్రీనివాస్ అవసరాల, రామ్ జగన్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : సాయి కార్తీక్
డైరెక్టర్ : ప్రభాకర్
ప్రొడ్యూసర్ : K.E. జ్ఞానవేల్ రాజా, బన్నివాస్
రిలీజ్ డేట్ : నవంబర్ 3, 2017
ఆది, వైభవి జంటగా నటించిన కామెడీ థ్రిల్లర్ నెక్స్ట్ నువ్వే. కిరణ్ (ఆది) తన గర్ల్ ఫ్రెండ్ తో పాటు మరో ఇద్దరు ఫ్రెండ్స్ తో కలిసి రిసార్ట్ నడుపుతుంటాడు. అయితే మిస్టీరియస్ గా ఆ రిసార్ట్ కి గెస్ట్ గా వచ్చిన వాళ్ళంతా చనిపోతుంటారు. ఆది & ఫ్రెండ్స్ కి ఏం చేయాలో అర్థంకాక ఆ శవాలను ఎవరికీ తెలియకుండా పూడ్చేస్తుంటారు. అయితే ఈ క్రమంలో ఆ రిసార్ట్ లో పనిచేసే వ్యక్తి ఆ విషయాన్ని పోలీసులకు చెప్పడంతో కథ అడ్డం తిరుగుతుంది.
ఎవరైతే ఆ రిసార్ట్ లో ఇప్పటి వరకు చనిపోయారో, వారి వివరాలను పరిశీలించిన పోలీసులు, అవన్నీ ఆల్రెడీ చనిపోయిన వారి వివరాలని చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. చనిపోయినవాళ్ళు మళ్ళీ చనిపోవడమేంటి..? అసలు ఆ రిసార్ట్ కి వరసగా వచ్చిన వాళ్ళెవరు..? వారికి ఆ రిసార్ట్ కి ఉన్న సంబంధమేంటి అనేదే ఈ సినిమాలోని ప్రధాన కథాంశం.
==============================================================================

బ్రాండ్ బాబు
నటీనటులు : సుమంత్ శైలేంద్ర, ఈషా రెబ్బ
ఇతర నటీనటులు : పూజిత పున్నాడ, మురళీ శర్మ, రాజా రవీంద్ర, సత్యం రాజేష్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : J.B.
డైరెక్టర్ : ప్రభాకర్ P.
ప్రొడ్యూసర్ : A. శైలేంద్ర బాబు
రిలీజ్ డేట్ : ఆగష్టు 3, 2018
వ్యాపారవేత్త డైమండ్ రత్నం (మురళీ శర్మ)కు బ్రాండ్స్ అంటే పిచ్చి. డబ్బున్నవాళ్ల స్టేటస్ మొత్తం వాళ్లు వాడే బ్రాండ్స్ లోనే కనిపిస్తుందనేది అతడి ప్రగాఢ విశ్వాసం. అతడి నమ్మకాలకు తగ్గట్టే కొడుకును పెంచుతాడు రత్నం. వాడే స్పూన్ నుంచి వేసుకునే అండర్ వేర్ వరకు ఇలా ప్రతిది బ్రాండ్ వాడే హీరో (సుమంత్ శైలేంద్ర) డైమండ్.. తనకు కాబోయే భార్య కూడా ఆల్-బ్రాండ్ అమ్మాయిగా ఉండాలని భావిస్తాడు.
అయితే ఒకసారి తనకొచ్చిన ఓ మెసేజ్ చూసి హోం మినిస్టర్ కూతురు తనను ప్రేమిస్తుందని భ్రమపడతాడు. తనను ఇంప్రెస్ చేసేందుకు తన ఇంటి చుట్టూ చక్కర్లు కొడుతుంటాడు. ఈ క్రమంలో హోం మినిస్టర్ కూతురు అనుకొని, ఆ ఇంట్లో పనిచేస్తున్న రాధ (ఇషా రెబ్బా)ను ప్రేమిస్తాడు. అక్కడే అసలు కథ బిగిన్ అవుతుంది. బ్రాండ్ నే నమ్ముకున్న డిమాండ్, పని మనిషితో ప్రేమలో పడితే ఏం జరుగుతుంది అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
==============================================================================

హైపర్
నటీనటులు : రామ్ పోతినేని, రాశిఖన్నా
ఇతర నటీనటులు : సత్యరాజ్, నరేష్, రావు రమేష్, తులసి శివమణి, ప్రభాస్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : జిబ్రాన్
డైరెక్టర్ : సంతోష్ శ్రీనివాస్
ప్రొడ్యూసర్ : రామ్ ఆచంట, గోపీ ఆచంట, అనిల్ సుంకర
రిలీజ్ డేట్ : 30 సెప్టెంబర్ 2016
వైజాగ్ లో ప్రభుత్వ ఆఫీస్ లో ఉద్యోగిగా పనిచేసే నారాయణ మూర్తి(సత్య రాజ్) కొడుకు సూర్య( రామ్) తన నాన్నని అమితంగా ప్రేమిస్తూ కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంటాడు. అయితే అంతలో ఎంతో నిజాయితీగా ఉద్యోగం చేస్తూ త్వరలో రిటైర్ కాబోయే నారాయణ మూర్తిని టార్గెట్ చేస్తాడు మినిస్టర్ రాజప్ప(రావు రమేష్). అలా నారాయణమూర్తిని టార్గెట్ చేసిన రాజప్ప… గజ(మురళి శర్మ)తో కలిసి నారాయణ మూర్తిని చంపాలని చూస్తాడు. ఈ విషయం తెలుసుకున్న సూర్య తన తండ్రిని ఎలా కాపాడుకున్నాడు. మినిస్టర్ రాజప్పను ఎలా సవాలు చేసి ఎదుర్కొన్నాడు? అనేదే ఈ సినిమా ప్రధాన కథాంశం.
==============================================================================

అందాల రాముడు
నటీనటులు : సునీల్, ఆర్తి అగర్వాల్
ఇతర నటీనటులు : ఆకాశ్, వడివుక్కరసి, కోట శ్రీనివాస రావు, బ్రహ్మానందం, ధర్మవరపు, వేణు మాధవ్ తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S.A. రాజ్ కుమార్
డైరెక్టర్ : P. లక్ష్మి కుమార్
ప్రొడ్యూసర్ : N.V. ప్రసాద్, పరాస్ జైన్
రిలీజ్ డేట్ : ఆగష్టు 11, 2006
సునీల్ తన కరియర్ లో ఫస్ట్ టైం ఫుల్ ఫ్లెజ్డ్ హీరోగా నటించిన చిత్రం అందాల రాముడు. ఈ సినిమా సునీల్ కరియర్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళింది. ఆర్తి అగర్వాల్ నటన సినిమాకే హైలెట్.
==============================================================================

విన్నర్
నటీనటులు : సాయి ధరమ్ తేజ్, రకుల్ ప్రీత్ సింగ్
ఇతర నటీనటులు : జగపతి బాబు, ఠాకూర్ అనూప్ సింగ్, ఆదర్శ్ బాలకృష్ణ, ప్రియదర్శి పుల్లికొండ, ముకేష్ రిషి, ఆలీ, వెన్నెల కిషోర్ మరియు తదితరులు
మ్యూజిక్ డైరెక్టర్ : S. తమన్
డైరెక్టర్ : గోపీచంద్ మాలినేని
ప్రొడ్యూసర్ : నల్లమలుపు బుజ్జి, ఠాగూర్ మధు
రిలీజ్ డేట్ : 24 ఫిబ్రవరి 2017
సిద్దార్థ్ అనే యువకుడు (సాయి ధరమ్ తేజ్) చిన్నతనంలో కొన్ని సంఘటనల వల్ల తన తండ్రి మహేందర్ రెడ్డి(జగపతి బాబు) కి దూరంగా ఉంటూ రేసింగ్, గుర్రాలపై ద్వేషం పెంచుకుంటాడు.. అలా తండ్రికి దూరంగా ఉంటూ జీవితాన్ని కొనసాగిస్తున్న సిద్దార్థ్ ఒక సందర్భంలో సితార(రకుల్) అనే రన్నర్ ని చూసి ప్రేమలో పడతాడు. అలా తన ప్రేమలో పడిన సిద్దార్థ్ ను ఓ అనుకోని సందర్భంలో ఆది అనే రేసింగ్ జాకీ తో బెట్ కట్టిస్తుంది సితార. అలా సితార ప్రేమ కోసం తనకిష్టం లేని రేసింగ్ మొదలుపెట్టిన సిద్దార్థ్… ఆ రేసింగ్ లో ఎలా గెలిచాడు.. చివరికి తనకు 20 ఏళ్ల క్రితం దూరమైన తండ్రికి ఎలా దగ్గరయ్యాడు.. అనేది సినిమా కథాంశం.
==============================================================================

అన్నవరం
నటీనటులు : పవన్ కళ్యాణ్, ఆసిన్
ఇతర నటీనటులు : సంధ్య, ఆశిష్ విద్యార్థి, లాల్, నాగేంద్ర బాబు, వేణు మాధవ్, బ్రహ్మాజీ, L.B. శ్రీరామ్, హేమ
మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల
డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు
ప్రొడ్యూసర్స్ : పరాస్ జైన్, N.V. ప్రసాద్
రిలీజ్ డేట్ : 29 డిసెంబర్ 2006
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, అసిన్ జంటగా నటించిన అన్నవరం పర్ ఫెక్ట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ తన చెల్లిని ప్రాణంగా ప్రేమించే అన్నయ్యలా నటించాడు. చెల్లెల్ని రక్షించుకోవడం కోసం ఒక అన్న ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడు అనేదే ప్రధాన కథాంశం.