గ్రాండ్ గా రిలీజైన ‘మిస్టర్ మజ్ను’

Friday,January 25,2019 - 10:03 by Z_CLU

గ్రాండ్ గా రిలీజైంది ‘మిస్టర్ మజ్ను’. మోస్ట్ ప్యాషనేట్ లవర్ గా నటించాడు అఖిల్ ఈ సినిమాలో. ఇప్పటికే అగ్రెసివ్ ప్రమోషన్స్ తో ఆల్మోస్ట్ యూత్ అటెన్షన్ ని గ్రాబ్ చేసిన ఈ సినిమా, అప్పుడే సోషల్ మీడియాలో పాజిటివ్ బజ్ ని క్రియేట్ చేయడం బిగిన్ చేసేసింది.

తన గత సినిమాల కన్నా ఈ సినిమాలో మరింత హ్యాండ్ సమ్ గా కనిపిస్తున్నాడు అఖిల్. ఈ సినిమా టైటిల్ ట్రాక్ తో పాటు రిలీజైన అఖిల్ లుక్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసింది. జస్ట్ టైటిల్ సాంగ్ కోసమే చాలా కష్టపడ్డాడు అఖిల్. ఈ సాంగ్ రిలీజైనప్పటి నుండి సోషల్ మీడియాలో క్రియేట్ అయిన వైబ్స్, రిలీజ్ కి ముందే సినిమాని సక్సెస్ ట్రాక్ పై నిలబెట్టేశాయి.

సినిమాని ఏ స్థాయిలో ప్రమోట్ చేసినా, సినిమా స్టోరీలైన్ ని ఏ మాత్రం రివీల్ చేయకుండా సస్పెన్స్ మెయిన్ టైన్ చేసిన మేకర్స్, సినిమా సక్సెస్ గ్యారంటీ అని చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. వెంకీ అట్లూరి ఈ సినిమాకి డైరెక్టర్.  తమన్ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేశాడు. B.V.S.N. ప్రసాద్ ఈ సినిమాకి ప్రొడ్యూసర్.