బాలయ్య తర్వాత వెంకీ తోనే...?

Saturday,March 25,2017 - 03:06 by Z_CLU

టాలీవుడ్ లో జెట్ స్పీడ్ తో సినిమాలు చేసే టాప్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రెజెంట్ బాలయ్య తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించి మొదటి షెడ్యూల్ ఫినిష్ చేసిన పూరి మరో షెడ్యూల్ కి రెడీ అవుతూనే మరో సీనియర్ హీరో తో నెక్స్ట్ సినిమా ప్లాన్ చేస్తున్నాడు..

ప్రెజెంట్ విక్టరీ వెంకటేష్ కోసం ఓ స్క్రిప్ట్ రాస్తున్న పూరి బాలయ్య తర్వాత ఆ సినిమా చేయబోతున్నాడనే టాక్ వినిపిస్తుంది. తాజాగా వెంకీ కూడా పూరి తన కోసం ఓ స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లు చెప్పకనే చెప్పేశాడు. సో పూరి వెంకీ ల కాంబో కూడా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందన్నమాట..