జీ సినిమాలు అవార్డ్స్ విజేతలు

Saturday,March 25,2017 - 04:00 by Z_CLU

జీ సినిమాలు ఛానెల్ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అవార్డ్స్ కార్యక్రమంలో ఎన్టీఆర్, సమంత, రానా, రకుల్, దేవిశ్రీప్రసాద్ ప్రతిష్టాత్మక అవార్డులు అందుకున్నారు. 11 కేటగిరీల్లో జరిగిన ఓటింగ్ ప్రాసెస్ లో కీలకమైన అవార్డులు వీళ్లకి దక్కాయి.

 

కింగ్ ఆఫ్ బాక్సాఫీస్ :

బాక్సాఫీస్ బద్దలు కొట్టి, రికార్డ్స్ ని తిరగరాసిన బిగ్గెస్ట్ స్టార్స్ పోటీ పడిన ఈ క్యాటగిరీలో అత్యధిక వోట్స్ తో అందరికంటే ముందు నిలిచారు యంగ్ టైగర్ NTR. హైఎండ్ కాంపిటీషన్ మధ్య ఫస్ట్ ప్లేస్ లో నిలిచిన యంగ్ టైగర్, అత్యంత ప్రతిష్టాత్మకమైన జీ సినిమాలు ‘కింగ్ ఆఫ్ బాక్సాఫీస్’ అవార్డును అందుకున్నారు.

 

క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్

2016 లోహిట్ సినిమాల్లో తమ గ్లామర్ తో,క్యూట్ పర్ఫామెన్స్ తో మెస్మరైజ్ చేసిన ముద్దుగుమ్మల్లో అత్యధిక ఓట్లు దక్కించుకున్నారు సమంత. లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ కమర్షియల్ హీరోయిన్ అనిపించుకున్న సమంతకు.. www.zeecinemalu.com లో పెట్టిన ఓటింగ్ లో అత్యధిక ఓట్లు వచ్చాయి. అలా మోస్ట్ ప్రెస్టీజియస్ క్వీన్ ఆఫ్ బాక్సాఫీస్ అవార్డు అందుకున్నారు సమంత.

 

బ్యాడీ ఆఫ్ ది ఇయర్ :

‘నాన్నకు ప్రేమతో’ సినిమాలో పర్ఫెక్ట్ విలనిజం తో మెస్మరైజ్ చేసి స్టైలిష్ విలన్ గా ఎంటర్టైన్ చేసిన జగపతి బాబు ఈ సినిమాకు గాను  2016 బ్యాడీ ఆఫ్ ది ఇయర్ అవార్డు ను అందుకున్నారు.

 

ఫాస్ట్ ట్రాక్ రిఫ్లక్స్ ఫిట్టెస్ట్ స్టార్ :

టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో రానాను ఫాస్ట్ ట్రాక్ రిఫ్లక్స్ ఫిట్టెస్ట్ స్టార్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది. బాహుబలి సినిమాలో భళ్లాలదేవ పాత్రతో మెప్పించిన రానా.. తన అల్టిమేట్ ఫిజిక్ తో క్యారెక్టర్స్ కు ఓ స్పెషల్ లుక్ తీసుకొచ్చాడు. తాజాగా వచ్చిన ఘాజీ సినిమాలో రానా పర్ ఫార్మెన్స్ సింప్లీ సూపర్బ్. అందుకే ఫాస్ట్ ట్రాక్ రిఫ్లక్స్ ఫిట్టెస్ట్ స్టార్ అవార్డు రానాను వరించింది.

 

 

ఫిట్టెస్ట్ స్టార్ అవార్డు-ఫిమేల్:

ఇక ఫాస్ట్ ట్రాక్ రిఫ్లెక్స్ ఫిట్టెస్ట్ స్టార్ అవార్డు – ఫిమేల్ ను రకుల్ ప్రీత్ సింగ్ దక్కించుకుంది. తనకు ఫుడ్ ఎంత ఇంపార్టెంటో.. ఎక్సర్ సైజ్ కూడా అంతే ఇంపార్టెంట్ అనే రకుల్… ఫిట్ నెస్ బిజినెస్ లోకి కూడా ఎంటరైంది. ప్రస్తుతం టాలీవుడ్ హాట్ బ్యూటీగా కొనసాగుతున్న రకుల్… ఫిట్టెస్ట్ స్టార్ అవార్డు-ఫిమేల్కు బెస్ట్ ఛాయిస్ అనిపించుకుంది.

బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్ :

తన పాటలతో రిలీజ్ కు ముందే సినిమాను హిట్ చేసే టాలెంట్ దేవిశ్రీప్రసాద్ సొంతం. దేవిశ్రీ సంగీతం అందిస్తున్నాడంటే సినిమా సగం హిట్ అయిపోయినట్టే. తన అల్టిమేట్ ట్యూన్స్ తో అటు కుర్రాళ్లను ఇటు పెద్దోళ్లను ఎట్రాక్ట్ చేస్తున్నాడు dsp. లాస్ట్ ఇయర్ దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన సాంగ్స్ అన్నీ హిట్టే. అందుకే జీ సినిమాలు అవార్డ్స్ బెస్ట్ మ్యూజిక్ డైరక్టర్

 

బ్లాక్ బస్టర్ మూవీ అవార్డ్ :

సరికొత్త కంటెంట్ తో,మెస్మరైజింగ్ ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్స్ తో మూవీ లవర్స్ తో భేష్ అనిపించుకున్న మూవీ జనతా గ్యారేజ్.బ్లాక్ బస్టర్ మూవీ అవార్డ్ కేటగిరీలో ఈ సినిమాకే హయ్యస్ట్ ఓట్స్ వచ్చాయి. ఎన్టీఆర్-కొరటాల ఫస్ట్ కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా… జీ సినిమాలు బ్లాక్ బస్టర్ మూవీ అవార్డుకు ఎంపికైంది. ఈ సినిమాను నిర్మించిన మైత్రీ మూవీస్ సంస్థలో ఒకరైన నిర్మాత రవిశంకర్.. జీ సినిమాలు బ్లాక్ బస్టర్ మూవీ అవార్డును అందుకున్నారు. కంగ్రాట్యులేషన్స్ రవిశంకర్ గారు.

 

కెప్టెన్ ఆఫ్ ది షిప్ :

2016లో జస్ట్ కొత్త సినిమాలు మాత్రమే రిలీజ్ కాలేదు. సరికొత్త ట్రెండ్స్ కూడా సెట్ అయ్యాయి. టాలీవుడ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకువెళ్ళే సినిమాలెన్నో ఈ ఇయర్ మెస్మరైజ్ చేశాయి.అలాంటి సూపర్ హిట్ మూవీస్ అందించిన డైరక్టర్స్ కొందరు కెప్టెన్ ఆఫ్ ది షిప్ అవార్డు కింద పోటీపడ్డారు. హై ఎండ్ కాంపిటీషన్ మధ్య జరిగిన ఈ క్యాటగిరీ వోటింగ్ ప్రాసెస్ లో విజేతగా నిలిచాడు కెప్టెన్ కొరటాల శివ. ఈ సందర్భంగా కొరటాల శివ కి ‘కెప్టెన్ ఆఫ్ ది షిప్’ అవార్డ్ ని సగర్వంగా సమర్పించింది జీ సినిమాలు.

 

బాయ్ నెక్స్ట్ డోర్ :

నాట్ జస్ట్ హీరోయిజం, స్క్రీన్పై చూడగానే మన పక్కింటి అబ్బాయిలా కనిపించేవాడే నిజమైన హీరో.అందరికీ కనెక్ట్ అయ్యేవాడే హీరో. అందుకే బాయ్ నెక్ట్స్ డోర్ అవార్డ్ ను ప్రవేశపెట్టింది జీ సినిమాలు. ఈ కేటగిరీలో కూడా హెవీ కాంపిటిషన్ నడిచింది. నువ్వా-నేనా అన్నట్టు పోటీ సాగింది. ఫైనల్ గా అందరికంటే ఎక్కువ ఓట్లతో విజేతగా నిలిచాడు నేచురల్ స్టార్ నాని.

గర్ల్ నెక్స్ట్ డోర్ :

గర్ల్ నెక్ట్స్ డోర్ కేటగిరీ కూడా ఇలాంటిదే. గ్లామర్ తో మెస్మరైజ్ చేయడమే కాకుండా, మనలో ఒకరిలా అనిపించే అమ్మాయి క్వాలిటీస్ కూడా ఉండాలి. అందుకే ఈ అవార్డును ప్రత్యేకంగా ఇంట్రడ్యూస్ చేసింది జీ సినిమాలు. ఈ కేటగిరీలో లావణ్య త్రిపాఠి, అనుపమ పరమేశ్వరన్, రీతూవర్మ, మెహ్రీన్ లాంటి ముద్దుగుమ్మలు పోటీపడ్డారు. ఫైనల్ గా లావణ్య త్రిపాఠి గర్ల్ నెక్ట్స్ డోర్ అవార్డ్ ను ఎగరేసుకుపోయింది.

 

కామెడీ ఖిలాడీ అవార్డ్ :

తన హ్యూమరైజ్డ్ మ్యానరిజం తో సినిమాకి పెద్ద ఎసెట్ గా నిలిచిన కామెడీ ఖిలాడీ 2016లో చాలామంది ఉన్నారు. ఎక్స్ ప్రెస్ రాజాలో సప్తగిరి తెగ నవ్వించాడు. బాబు బంగారంలో పృధ్వీ చేసిన బత్తాయి బాబ్జీ క్యారెక్టర్ ఇప్పటికీ అందరికీ గుర్తే. ఎక్కడికి పోతావ్ చిన్నవాడా సినిమాలో వెన్నెల కిషోర్ ఎక్స్ ప్రెషన్స్ ను ఎలా మరిచిపోగలం చెప్పండి. ఇక పెళ్లి చూపులు అనే సినిమాతో ప్రియదర్శి అనే కమెడియన్ కూడా టాలీవుడ్ కు పరిచయం అయ్యాడు. అయితే జీ సినిమాలు వెబ్ సైట్ పోలింగ్ లో మాత్రం ఎక్కువ ఓట్లు ప్రియదర్శికే పడ్డాయి. సో.. 2016 కామెడీ ఖిలాడీ ప్రియదర్శి.

 

సౌత్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ :

టాలీవుడ్ లో తమిళ హీరోలు మెరుపులు మెరిపించడం కామన్. లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది కోలీవుడ్ హీరోలు తెలుగుతెరపై క్లిక్ అయ్యారు. అలాంటి హీరోల కోసం పెట్టిన అవార్డే సౌత్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్. ఈ కేటగిరీలో  అన్నదమ్ములు సూర్య, కార్తితో పాటు.. విజయ్ ఆంటోనీ, హీరో విజయ్ పోటీపడ్డారు. ఫైనల్ గా టాలీవుడ్ ఆడియన్స్  అందరికీ బాగా కనెక్ట్ అయిన సూర్య.. సౌత్ సెన్సేషన్ ఆఫ్ ది ఇయర్ గా ఎలక్ట్ అయ్యాడు.

 

 

సర్ ప్రయిజ్ హిట్ ఆఫ్ ది ఇయర్ :

అంచనాలతో వచ్చిన సినిమాల్లో కంటెంట్ బాగుంటే కచ్చితంగా క్లిక్ అవుతాయి. అందరి చూపు దానిపైనే ఉంటుంది కాబట్టి కలెక్షన్లకు ఢోకా ఉండదు. మరి ఎలాంటి స్టార్ ఎట్రాక్షన్ లేకుండా, లైట్ ప్రమోషన్ తో, అస్సలు అంచనాలు లేకుండా థియేటర్లలోకి వచ్చి సూపర్ హిట్ అయిన సినిమాల్ని ఏమనాలి..? అలాంటి సినిమాకే సర్ ప్రైజ్ హిట్ ఆఫ్ ది ఇయర్ అవార్డ్ ఇవ్వాలని నిర్ణయించింది జీ సినిమాలు. ఈ కేటగిరీలో ఎక్కడికి పోతావ్ చిన్నవాడా, క్షణం, పెళ్లిచూపులు, జ్యో అచ్యుతానంద సినిమాలు పోటీపడ్డాయి. ఫైనల్ గా ప్రేక్షకులు మాత్రం తమ జడ్జిమెంట్ ను పెళ్లిచూపులు సినిమాకు అనుకూలంగా ఇచ్చారు. సో.. 2016 సర్ ప్రైజ్ హిట్ ఆఫ్ ది ఇయర్ ఈజ్ పెళ్లిచూపులు.

 

న్యూ బీ ఆఫ్ ది ఇయర్ (మేల్):

2016 లో ఫ్రెష్ లుక్స్ తో…అవుట్ స్టాండింగ్ ట్యాలెంట్ తో చాలా మంది యంగ్ హీరోలు సిల్వర్ స్క్రీన్ పై మెస్మరైజ్ చేసి, జస్ట్ ఒక్క సినిమాతోనే స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్నారు. ఆ రేంజ్ ఇంపాక్ట్ ని క్రియేట్ చేసిన న్యూ ఫేసెస్ పోటీ పడ్డ ఈ క్యాటగిరీ లో హైయెస్ట్ వోట్స్తోనిలిచాడు రోషన్. అందుకే జీ సినిమాలు ‘న్యూ బీ ఆఫ్ ది ఇయర్’ విన్నర్ రోషన్ మేక.

 

న్యూ బీ ఆఫ్ ది ఇయర్ (ఫిమేల్) :

జస్ట్ గ్లామరస్ గా కనిపించడమే కాదు, అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ తో సిల్వర్ స్క్రీన్ పై తన సొంత మార్క్ ని క్రియేట్ చేసుకున్న హీరోయిన్స్ పోటీపడ్డ ఈ క్యాటగిరీలో హైయెస్ట్ వోట్స్దక్కించుకున్న హీరోయిన్ కీర్తి సురేష్.మొదటి సినిమా నేను శైలజతోనే ఈ ముద్దుగుమ్మ అందరి మనసుల్ని కొల్లగొట్టింది. సోజీ సినిమాలు ‘న్యూ బీ ఆఫ్ ది ఇయర్- ఫీమేల్’ కీర్తి సురేష్.