సమ్మర్ ఎండింగ్ లో నాని...

Saturday,March 25,2017 - 02:06 by Z_CLU

ప్రెజెంట్ టాలీవుడ్ లో వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ దూసుకెళ్తున్న నేచురల్ స్టార్ నాని మరో సినిమాతో ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇటీవలే ‘నేను లోకల్’ సినిమాతో తో గ్రాండ్ హిట్ సాధించిన నాని ప్రస్తుతం సమ్మర్ ఎండింగ్ లో మరో సినిమాను థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నాడు.

ప్రస్తుతం నాని నటిస్తున్న లేటెస్ట్ సినిమా ‘నిన్ను కోరి’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఇటీవలే యు.ఎస్ లో మొదటి షెడ్యూల్ పూర్తి చేసిన యూనిట్ ప్రస్తుతం హైదరాబాద్ లో పలు కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. షెడ్యూల్ ఫినిష్ అవగానే ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా ఈ సినిమా షూట్ లో పాల్గొంటున్న నాని ఈ సినిమాను సమ్మర్ ఎండింగ్ కల్లా థియేటర్స్ లోకి తీసుకురావాలని చూస్తున్నాడు . మరి ఈ సినిమాతో సమ్మర్ ఎండింగ్ లో నాని ఎలాంటి సందడి చేస్తాడో..చూడాలి..