Samantha Yashoda movie - షూటింగ్ అప్ డేట్స్

Sunday,January 09,2022 - 03:25 by Z_CLU

Samantha’s Yashoda Movie Shooting Updates

సమంత ప్రధాన పాత్రలో రూపొందుతున్న చిత్రం ‘యశోద’. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మిస్తున్నారు. హరి – హరీష్ దర్శకులుగా పరిచయం అవుతున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా సెకెండ్ షెడ్యూల్ మొదలైంది. 12వ తేదీ వరకు ఈ షెడ్యూల్ ఉంటుంది.

నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “సమంత ప్రధాన పాత్రలో మా సంస్థలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రమిది. సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఈ నెల 12 వరకూ ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాలు చిత్రీకరించేలా ప్లాన్ చేశాం. సంక్రాంతి తర్వాత మూడో షెడ్యూల్ స్టార్ట్ చేస్తాం. మార్చి నెలాఖరుకు చిత్రీకరణ పూర్తి అవుతుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఏక కాలంలో విడుదల చేస్తాం” అని చెప్పారు.

సమంతతో పాటు వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ఈ చిత్రం ప్రధాన తారాగ‌ణం. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

Samantha Akkineni