త్రివిక్రమ్ కొత్త సెంటిమెంట్...

Friday,August 23,2019 - 10:02 by Z_CLU

త్రివిక్రమ్ ‘అ’ సెంటిమెంట్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అవుతున్నాడనేది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. అయితే ఈ మాసివ్ డైరెక్టర్ ఇంకో సెంటిమెంట్ ని కూడా అంతే సీరియస్ గా ఫాలో అవుతున్నాడు. అవే సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్ ని టైటిల్స్ లో పెట్టుకోవడం…

అ..ఆ : అనసూయ రామలింగం… ఆనంద్ విహారి. ఇవి ఆ సినిమాలో లీడ్ రోల్స్ పేర్లు.. త్రివిక్రమ్ తన సెంటిమెంట్ ని ఈ సినిమాతోనే ఎక్స్ పెరిమెంట్ చేశాడు. హీరోయిన్ పేరులోంచి మొదటి అక్షరాన్ని టైటిల్ లో పెట్టాడు.. సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది.

అరవింద సమేత : ఈ సినిమా వరకు వచ్చేసరికి కంప్లీట్ గా హీరోయిన్ క్యారెక్టర్ పేరు పెట్టుకున్నాడు. పూజాహెగ్డే ఈ సినిమాలో ‘అరవింద’ గా కనిపించింది. సినిమా టైటిల్ ‘అరవింద సమేత’. సినిమా కథకి టైటిల్ పర్ఫెక్ట్ జస్టిఫికేషన్ అనిపిస్తుంది.

అల… వైకుంఠపురం లో..: బన్నితో ప్రస్తుతం సెట్స్ పై ఉన్న సినిమా.  ఈ టైటిల్ అనౌన్స్ అయిన కొత్తలో కొంతమంది ‘అల..’ అనగానే సముద్రపు అల అనుకున్నారు కానీ.. నిజానికి ఇక్కడ కూడా త్రివిక్రమ్ సెంటిమెంటే కనిపిస్తుంది. ఇంకా ఎక్కడా అఫీషియల్ గా కన్ఫర్మేషన్   లేదు కానీ, ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ పేరు ‘అలకనంద’ అని తెలుస్తుంది… అలా ‘అల’ అని రెండక్షరాలతో సరిపెట్టుకున్నాడు త్రివిక్రమ్.