Samantha రేపే 'యశోద' రిలీజ్

Thursday,November 10,2022 - 01:15 by Z_CLU

Samantha’s Yashoda Grand Release tomorrow

సమంత (Samantha) టైటిల్ రోల్ నటించిన ‘యశోద’ (Yashoda) రేపే గ్రాండ్ గా థియేటర్స్ లోకి ఎంట్రీ ఇస్తుంది. హరి -హరీష్ దర్శకత్వంలో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమ సరోగసి కాన్సెప్ట్ తో ఆడియన్స్ ను థ్రిల్ చేయనుందని టీం చెప్తుంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్ మంచి ఇంపాక్ట్ తీసుకొచ్చాయి. తాజాగా సమంత ఈ సినిమా గురించి చెప్తూ ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. సినిమాలో ఎవరూ ఊహించని ట్విస్టులు ఉంటాయని సామ్ తెలిపింది.

ప్రస్తుతం తన హెల్త్ కండీషన్ బాలేకపోయినప్పటికీ ఈ సినిమా కోసం సమంత బెడ్ పై నుండే డబ్బింగ్ చెప్పడం సింపతీ క్రియేట్ చేసింది. అయితే యాక్టర్ గా కూడా ఈ సినిమా కోసం చాలా కష్టపడి ఎన్నో ఛాలెంజ్లు ఫేస్ చేసింది సామ్. ముఖ్యంగా యాక్షన్ ఎపిసోడ్స్ లో డూప్ లేకుండా ఫైట్స్ చేసింది. ఇక ఈ వారం హాలీవుడ్ వాకాండ ఫరెవర్ సినిమా మినహా సమంత  మూవీకి మరే పోటీ లేదు. టాక్ ఏ మాత్రం బాగున్నా సినిమా మంచి కలెక్షన్స్ అందుకోవడం ఖాయం.

శ్రీదేవి మూవీస్ బేనర్ పై సీనియర్ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు మణిశర్మ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. పులగం చిననారాయణ , డా.చల్లా భాగ్యలక్ష్మి మాటలు అందించారు.

 

 

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics