Samantha Yashoda - కొత్త సినిమా స్టార్ట్ చేసిన సమంత

Monday,December 06,2021 - 04:11 by Z_CLU

Samantha New Movie Titled as Yashoda, Shoot Started

సినిమాలైతే ప్రకటిస్తోంది కానీ, సెట్స్ పైకి మాత్రం రాలేదు సమంత. ఎట్టకేలకు ఆ రోజు కూడా రానే వచ్చింది. ఈరోజు నుంచి తన కొత్త సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసింది సమంత. ఈ సందర్భంగా సినిమా టైటిల్ కూడా ప్రకటించారు.

శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మాతగా ఓ సినిమాకు ఓకే చెప్పింది సమంత. హరి, హరీష్ అనే ఇద్దరు ఈ సినిమాతో దర్శకులుగా పరిచయమౌతున్నారు. ఈ సినిమాకు యశోద అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పూజాకార్యక్రమాలతో ఈరోజు మొదలైంది.

తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను సైమల్టేనియస్ గా షూట్ చేస్తారు. సినిమాను మాత్రం పాన్ ఇండియా లెవెల్లో ఒకేసారి.. తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల చేయబోతున్నారు. మణిశర్మ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతల సినిమా షూటింగ్ పూర్తిచేసింది సమంత. ఆ మూవీ తర్వాత యశోద సినిమానే రిలీజ్ అవుతుంది. ఈ సినిమాలతో పాటు సమంత చేతిలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై చేయబోయే ద్విభాషా చిత్రం, ఓ హాలీవుడ్ సినిమా ఉన్నాయి.

samantha-akkineni-new-stills