రామ్ చరణ్ తరవాత ఇప్పుడు వరుణ్ తేజ్

Friday,September 06,2019 - 11:03 by Z_CLU

మెగా హీరోల్లో ఒకొక్కరిది ఒక్కో స్టైల్. అయితే రామ్ చరణ్, వరుణ్ తేజ్ లుక్స్ విషయంలో అవుట్ స్టాండింగ్ ఎఫర్ట్స్ పెడుతున్నారు. దానికి తోడు చేస్తున్న సినిమాలు వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో ఉండటంతో పాత స్టైల్ లో మరింత కొత్తగా కనిపిస్తున్నారు. మెగా హీరోల్లో ఇలా వింటేజ్ బ్యాక్ డ్రాప్ లో కనిపించే అవకాశం ఈ ఇద్దరికే దొరికింది. 

‘రంగస్థలం’ లో 1980 బ్యాక్ డ్రాప్ లో వింటేజ్ లుక్స్ లో కనిపించాడు రామ్ చరణ్. కాస్ట్యూమ్స్ దగ్గరి నుండి రామ్ చరణ్ మాట్లాడే విధానం వరకు ప్రతీది, సినిమా చూసిన ఆడియెన్స్ ని కూడా 1980 కి తీసుకెళ్ళిపోయాయి. చిట్టిబాబుగా రామ్ చరణ్ తనలోని నట విశ్వరూపాన్ని చూపించాడు.

ఇప్పుడు వరుణ్ తేజ్ ‘వాల్మీకి’ లో కూడా వరుణ్ తేజ్ డిఫెరెంట్ లుక్స్ లో కనిపిస్తున్నాడు. మొదట్లో ఈ సినిమా నుండి బయటికి వచ్చిన లుక్స్ లో కరుడు గట్టిన రౌడీలా కనిపిస్తే.. రీసెంట్ గా పూజా హెగ్డే కాంబినేషన్ లో వచ్చిన  స్టిల్స్ లో వరుణ్ తేజ్ అంతే న్యాచురల్ గా ఉంగరాల జుట్టుతో మెస్మరైజ్ చేస్తున్నాడు.

కొన్ని స్టిల్స్ లో అయితే వరుణ్ తేజ్ మెగాస్టార్ కరియర్ బిగినింగ్ లో కనిపించిన లుక్స్ ని గుర్తు చేస్తున్నాడు. ఇక రామ్ చరణ్ వరకు వస్తే అల్లూరి సీతారామ రాజుగా RRR కూడా మళ్ళీ వింటేజ్ బ్యాక్ డ్రాప్ లోనే నటిస్తున్నాడు.