వాల్మీకి - కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

Wednesday,August 28,2019 - 12:04 by Z_CLU

వాల్మీకి Vs గ్యాంగ్ లీడర్.. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడా పోటీ లేదు. వాల్మీకి సినిమాకు కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 20న వాల్మీకి సినిమా థియేటర్లలోకి వస్తుంది.

పండగల టైమ్ లో పెద్ద సినిమాలు 2-3 ఒకేసారి రిలీజైనా ఫర్వాలేదు. మార్కెట్ ఉంటుంది. కానీ అన్-సీజన్ లో కూడా సినిమాలు పోటీపడితే ఇండస్ట్రీకి ప్రమాదం. అందుకే ప్రొడ్యూసర్స్ గిల్డ్ సభ్యులంతా కూర్చొని మాట్లాడుకున్నారు. గ్యాంగ్ లీడర్ తర్వాత వారం గ్యాప్ ఇచ్చి వాల్మీకిని విడుదల చేసేలా ఒప్పించారు.

14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది వాల్మీకి. వరుణ్ తేజ్ ఇందులో నెగెటివ్ షేడ్స్ లో కనిపించబోతున్నాడు. అతడి లుక్స్ కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. అటు పూజా హెగ్డే ఫస్ట్ లుక్ ను కూడా రీసెంట్ గా రిలీజ్ చేశారు. మిక్కీ జే మేయర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.