సెప్టెంబర్ బాక్సాఫీస్ రివ్యూ

Tuesday,October 01,2019 - 10:03 by Z_CLU

సెప్టెంబర్ బాక్సాఫీస్ ఒకరకంగా స్టార్ వ్యాల్యూ మరీ ఎక్కువగా లేని సినిమాలతో ముగిసిందని చెప్పాలి.. మహా అయితే ఒకటీ అరా తప్ప, ఏ మాత్రం హైప్ లేని సినిమాలే ఈ సినిమాలు ఈ నెలలో రిలీజయ్యాయి. వాటిలో ఒక్కోటి ఒక్కోరకంగా బాక్సాఫీస్ దగ్గర పర్ఫామ్ చేశాయి.

ఫస్ట్ వీక్ : ఉండిపోరాదే, నీకోసం, దర్పణం, 2 అవర్స్ లవ్.. ఈ వారం రిలీజైన 4 సినిమాలు కొత్త నటీనటులు ఇంట్రడ్యూస్ చేసినవే. ఇందులో ఒక్కటి కూడా ఇంప్రెసివ్ అనిపించుకోలేదు. ఇక వీటితో పాటు కొద్దో గొప్పో హైప్ క్రియేట్ చేస్తూ రిలీజైన ఆది సాయికుమార్ ‘జోడీ’ కూడా బాక్సాఫీస్ దగ్గర పెద్దగా పర్ఫామ్ చేయలేదు. దాంతో ఈ వీక్ కూడా ‘సాహో’ కే మొగ్గింది.

సెకండ్ వీక్ : ఈ వారం రిలీజైన 3 సినిమాలు… ఇంట్రెస్ట్ ని జెనెరేట్ చేసినవే. డబ్బింగ్ సినిమా ‘పహిల్వాన్’ మాస్ ఆడియెన్స్ కి కనెక్ట్ అయిందనిపించినా బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఇక మార్షల్ కూడా అంతంత మాత్రమే అనిపించుకుంది. ఈ రెండు సినిమాలతో పాటు హిలేరియస్ రివేంజ్ ఎంటర్టైనర్ తో వచ్చిన నాని ‘గ్యాంగ్ లీడర్’ ఒక్కటే ఆడియెన్స్ కి ఆప్షన్ అవ్వడంతో… ఈ వీక్ గడిచిపోయింది అనిపించుకుంది.  

 

థర్డ్ వీక్ : రిలీజైంది 4 సినిమాలు ఈ వారంలో… బందోబస్త్, గద్దలకొండ గణేష్, పండుగాడి ఫోటో స్టూడియో, నేను నా నాగార్జున.. వీటన్నింటినీ డామినేట్ చేసింది మాత్రం ఒక్క గద్దల కొండ గణేష్ మాత్రమే. లాస్ట్ మూమెంట్ లో టైటిల్ మారినా.. సినిమా చుట్టూ క్రియేట్ అయిన హైప్… ఓపెనింగ్స్ పై పాజిటివ్ ఎఫెక్ట్ చూపిస్తే.. వరుణ్ తేజ్ డిఫెరెంట్ మేకోవర్.. దర్శకుడు హరీష్ శంకర్ సినిమాలో సేఫ్ సైడ్ గా క్రియేట్ చేసుకున్న ఎట్రాక్టివ్ ఎలిమెంట్స్.. సినిమాని ఫ్లాప్ రేంజ్ కి పడకుండా గట్టెక్కించేసింది.

ఫోర్త్ వీక్  : రిలీజైన 3 సినిమాలు కొత్త వాళ్ళు నటించినవే… నిన్ను తలచి, రాయలసీమ లవ్ స్టోరీ, రామ చక్కని సీత.. ఇవి రిలీజ్ కి ముందు హైప్ క్రియేట్ చేయడంలోనూ సక్సెస్ కాలేదు. అల్టిమేట్ గా బాక్సాఫీస్ దగ్గర కూడా పెద్దగా నిలబడలేదు. వెరసి ఈ వీక్ కూడా ప్రీవియస్ వీక్ సినిమాలే ఆడియెన్స్ కి ఎంటర్ టైనింగ్ ఆప్షన్స్ అనిపించుకున్నాయి.