విలన్ – సక్సెస్ అవుతున్న కొత్త ట్రెండ్

Saturday,September 14,2019 - 10:03 by Z_CLU

స్టార్ హీరోలే ఇప్పుడు సినిమాలో హై ఇంపాక్ట్ క్రియేట్ చేసే విలన్లు… ‘గ్యాంగ్ లీడర్’ సినిమాతో ఇది నిరూపించాడు కార్తికేయ. సినిమాలో నాని పర్ఫామెన్స్ కి ఎంత అప్లాజ్ వస్తుందో కార్తికేయ స్టైలిష్ పర్ఫామెన్స్ కి అంతే రెస్పాన్స్ వస్తుంది. టాలీవుడ్ లో వరసగా విలన్ రోల్స్ వేస్తున్న హీరోల్ని చూస్తుంటే, ఈ ట్రెండ్ సక్సెస్ అవుతుందనిపిస్తుంది. ఒకప్పుడు కాస్త డిఫెరెంట్ రోల్ ఉంటే బావుంటుందనుకున్న హీరోలు.. ఇప్పుడు స్ట్రేట్ గా విలన్ రోల్స్ కే ప్రిఫరెన్స్ ఇస్తున్నారనిపిస్తుంది.

వరుణ్ తేజ్ :  ‘వాల్మీకి’ లో వరుణ్ తేజ్ మరీ ఇంత మాస్ గా… ఈ స్థాయి విలన్ రోల్ చేస్తాడని కనీసం గెస్ కూడా చేయలేదు ఫ్యాన్స్. ఈ సినిమాకి సంతకం చేసేటప్పుడు ఒక్క క్షణం కూడా తన ఇమేజ్ గురించి ఆలోచించి ఉండడు ఈ మెగాహీరో… సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్న విజువల్స్ చూస్తుంటే… వరుణ్ తేజ్ విశ్వరూపం ఇదా.? అనిపిస్తుంది. రేపు రిలీజ్ తరవాత థియేటర్ లో ఈ గద్దలకొండ గణేష్ సృష్టించబోయే సునామీ ఎలా ఉండబోతుందోనని ఎగ్జైటెడ్ గా ఉన్నారు ఆడియెన్స్.

నాని : మ్యాగ్జిమం సర్ ప్రైజ్ చేయాలనుకుంటాడు నాని ఏ సినిమా చేసినా… అలాంటిది మోహన కృష్ణ ఇంద్రగంటి తో కొలాబోరేట్ అయ్యాడంటే సమ్ థింగ్ స్పెషల్ ఎలిమెంట్స్ ఉంటాయని ఈజీగా ఎక్స్ పెక్ట్ చేయొచ్చు. అలాంటిది ఈ సినిమాలో విలన్ క్యారెక్టర్ ని ఎంచుకున్నాడు నాని. దానికి తగ్గట్టు సినిమా టైటిల్ కూడా ‘V’. ఇంకేం కావాలి… చూస్తుంటే నాని కూడా మరింత మంది హీరోల్ని విలన్ గా మారడానికి ఇన్స్ పైర్ చేస్తాడనే అనిపిస్తుంది.

సిల్వర్ స్క్రీన్ పై అదిరిపోయే హీరోయిజం కన్నా విలన్ గా కనిపించి తమలోని పర్ఫామెన్స్ ఎబిలిటీస్ ని ఎలివేట్ చేసుకోవడానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు స్టార్ హీరోస్. వరస చూస్తుంటే టాలీవుడ్ లో ఈ ట్రెండ్ మరింత సక్సెస్ అయ్యే అవకాశాలే కనిపిస్తున్నాయి.