‘వాల్మీకి’ లో మోస్ట్ సస్పెన్స్ ఎలిమెంట్...

Thursday,September 19,2019 - 11:03 by Z_CLU

తమిళ సినిమా ‘జిగార్తాండ’ చూసిన వాళ్లకు ‘వాల్మీకి’ సినిమా కొత్తేం కాదు. మహా అయితే సినిమాలో నేటివిటీకి తగ్గట్టు చేసిన చేంజెస్.. వాటికి తోడు మెగా హీరో పవర్ ప్యాక్డ్ పర్ఫామెన్స్ ఈ సినిమాలో కొత్తగా ఎంటర్ టైన్ చేయబోతున్నాయి. అయితే ‘జిగార్తాండ’ చూసిన వాళ్లకు కూడా ‘వాల్మీకి’ లో క్యూరియాసిటీ జెనెరేట్ చేస్తున్న సస్పెన్స్ ఎలిమెంట్ పూజాహెగ్డే క్యారెక్టర్.

నిజానికి తమిళ సినిమాలో ఈ క్యారెక్టర్ లేనే లేదు. ‘వాల్మీకి’ కోసం పర్టికులర్ గా ఈ క్యారెక్టర్ ని రాసుకున్నాడు హరీష్ శంకర్. జస్ట్ హీరోయిన్ క్యారెక్టర్ ని ఆడ్ చేశాడు అనుకుంటే పర్వాలేదు.. కానీ ఆ క్యారెక్టర్ ని సీనియర్ నటి శ్రీదేవిని గుర్తు చేసుకునేటట్టు డిజైన్ చేసుకున్నాడు… రెగ్యులర్ హీరోయిన్ లా కాకుండా హరీష్ శంకర్ ఈ క్యారెక్టర్ కి ఎందుకింత ప్రిఫరెన్స్ ఇచ్చాడు..?

పూజా హెగ్డే క్యారెక్టర్ జస్ట్ ‘వెల్లువొచ్చి’ సాంగ్ కే పరిమితమా.? ప్రమోషన్ ప్రాసెస్ లో హరీష్ శంకర్ ఈ క్యారెక్టర్ గురించి రివీల్ చేస్తూ, పూజా హెగ్డే క్యారెక్టర్ జస్ట్ గెస్ట్ క్యారెక్టర్ మాత్రమే అని కన్ఫమ్ చేశాడు.. అంటే ఈ క్యారెక్టర్ ని దర్శకుడు ఎలా క్లోజ్ చేశాడు…?

స్క్రీన్ పై కనిపించేది కాసేపే అయినా పూజా హెగ్డే ప్లే చేసిన ‘శ్రీదేవి’ క్యారెక్టర్, ‘వాల్మీకి’ పై హెవీ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందనే వైబ్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. ఫ్యాన్స్ లో కూడా ప్రస్తుతానికి అదే ఫీలింగ్.. ఈ పాయింట్ పై ఎన్ని డిస్కర్షన్స్ జరిగినా… సినిమా రిలీజయితే కానీ ఈ సస్పెన్స్ రివీల్ కాదు.