సాహో ఫస్ట్ వీక్ కలెక్షన్

Friday,September 06,2019 - 11:39 by Z_CLU

ప్రభాస్ హీరోగా నటించిన భారీ బడ్జెట్ సినిమా సాహో నిన్నటితో ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుంది. ఈ వారం రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 74 కోట్ల 18 లక్షల రూపాయల షేర్ వచ్చింది. చూడ్డానికి ఈ వసూళ్లు కాస్త భారీగానే అనిపిస్తున్నప్పటికీ సినిమా బ్రేక్-ఈవెన్ అవ్వడానికి మాత్రం చాలా టైమ్ పట్టేలా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను అటుఇటుగా 125 కోట్ల రూపాయలకు అమ్మారు. సో.. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ సినిమాకు ఇంకా 50కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు రావాల్సి ఉంది. ఇవాళ్టి నుంచి సాహోకు థియేటర్లు తగ్గాయి. ఏకంగా 7 సినిమాలు రిలీజ్ అవ్వడంతో వాటికి కూడా కొన్ని స్క్రీన్స్ కేటాయించాల్సి వచ్చింది. సో.. ఈ వారం నుంచి సాహోకు అసలైన పరీక్ష మొదలైందన్నమాట.

ఏపీ, నైజాం 7 రోజుల షేర్
నైజాం – రూ. 26.22 కోట్లు
సీడెడ్ – రూ. 10.78 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 8.93 కోట్లు
ఈస్ట్ – రూ. 6.90 కోట్లు
వెస్ట్ – రూ. 5.30 కోట్లు
గుంటూరు – రూ. 7.46 కోట్లు
నెల్లూరు – రూ. 3.89 కోట్లు
కృష్ణా – రూ. 4.70 కోట్లు