రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న ‘గూఢచారి’

Friday,June 15,2018 - 03:44 by Z_CLU

అడివి శేష్ ‘గూఢచారి’ షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. U.S. తో పాటు హిమాచల్ ప్రదేశ్, కాకినాడ, న్యూఢిల్లీ, చిట్టగాంగ్, హైదరాబాద్, వైజాగ్ లాంటి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకున్న ఈ స్పై థ్రిల్లర్ ఆగష్టు 3 న గ్రాండ్ రిలీజ్ కి రెడీ అవుతుంది.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కిన ఈ సినిమాలో సుప్రియ యార్లగడ్డ కీ రోల్ ప్లే చేస్తుంది. దానికి తోడు ప్రకాష్ రాజ్ కూడా ఈ సినిమాలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయనున్నాడు.

 

శశికిరణ్ తిక్క డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల మ్యూజిక్ కంపోజర్. అభిషేక్ పిక్చర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో పాటు విస్టా డ్రీమ్ మర్చంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో అడివి శేష్ సరసన శోభిత ధూళిపాళ్ళ హీరోయిన్ గా నటిస్తుంది.