మెగాహీరో సరసన కళ్యాణి ప్రియదర్శన్

Friday,June 15,2018 - 05:14 by Z_CLU

అఖిల్ ‘హలో’ సినిమాతో కరియర్ సక్సెస్ ఫుల్ బిగినింగ్ కి కావాల్సినంత ఇంపాక్ట్ క్రియేట్ చేసుకుంది కళ్యాణి ప్రియదర్శన్. ఈ సినిమా తరవాత ఇమ్మీడియట్ గా సుధీర్ వర్మ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో హీరోయిన్ గా చాన్స్ కొట్టేసింది. ఈ సినిమా ఇంకా సెట్స్ పైనే ఉంది ఈ లోపు సాయి ధరం తేజ్ సరసన హీరోయిన్ గా  ఫిక్సయింది కళ్యాణి ప్రియదర్శన్.

సాయిధరమ్ సినిమాలో ఇద్దరుహీరోయిన్ నటించనున్నారు. ఇప్పటికే ఒక హీరోయిన్ గా రితికాసింగ్ ని ఫిక్స్ చేసుకున్న ఫిల్మ్ మేకర్స్, ఇప్పుడు కళ్యాణి ప్రియదర్శన్ ని కన్ఫమ్ చేశారు.

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి  ‘చిత్రలహరి’ అనే టైటిల్ ని కన్సిడర్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో ప్రీ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఫిల్మ్ మేకర్స్, త్వరలో సినిమాను సెట్స్ పైకి తీసుకువచ్చే ఆలోచనలో ఉన్నారు.