క్రికెటర్ గా నాని.. కరియర్ లోనే ఫస్ట్ టైమ్

Friday,June 15,2018 - 12:38 by Z_CLU

కొత్త సినిమా ఎనౌన్స్ చేశాడు నాని. మళ్లీ రావా ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటించబోతున్నాడు.  అల్టిమేట్ స్పోర్ట్స్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకి ‘జర్సీ’ అని టైటిల్ ఫిక్స్ చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై త్వరలోనే సెట్స్ పైకి రానుంది. ఈ కొత్త సినిమా.

 కృష్ణార్జున యుద్ధం రిజల్ట్ తేడా కొట్టడంతో స్టోరీ సెలక్షన్ విషయంలో కాస్త గ్యాప్ తీసుకున్నాడు నాని. అలా ఎన్నో కథలు విన్న తర్వాత గౌతమ్ తిన్ననూరి చెప్పిన స్టోరీలైన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఇందులో క్రికెటర్ గా కనిపించబోతున్నాడు నాని.

గతంలో భీమిలి కబడ్డీ జట్టు లాంటి స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేశాడు నాని. మళ్లీ ఇన్నేళ్లకు జెర్సీ టైటిల్ తో మరో స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేయబోతున్నాడు. కాకపోతే ఇది పూర్తిగా క్రీడానేపథ్యంలో సాగే సినిమా కాదు. ఓ మంచి లవ్ స్టోరీకి స్పోర్ట్స్ జానర్ యాడ్ అవుతుంది. ఇందులో నటించనున్న హీరోయిన్ ను త్వరలోనే ఎనౌన్స్ చేస్తారు.