దేవదాస్ చూడ్డానికి 7 కారణాలు

Tuesday,September 25,2018 - 05:25 by Z_CLU

థియేటర్లలోకి ఓ సినిమా వస్తుందంటే చాలు, అసలు ఎందుకు చూడాలనే ప్రశ్న తలెత్తుతుంది. అది ఎంత పెద్ద సినిమా అయినా క్వశ్చన్ కామన్. దేవదాస్ విషయంలో కూడా ఈ డౌట్ ఉంది. దీనికి సమాధానమే ఈ 7 రీజన్స్. ఈ వీకెండ్ థియేటర్లలో దేవదాస్ ఎందుకు చూడాలో చూద్దాం..

రీజన్ 1 – మల్టీస్టారర్

దేవదాస్ ఎందుకు చూడాలనే ప్రశ్నకు మెయిన్ రీజన్ ఇదొక మల్టీస్టారర్. పైగా నాగార్జున, నాని లాంటి ఇద్దరు బిగ్ స్టార్స్ కలిసి నటించిన సినిమా. అందుకే మార్కెట్లో హాట్ కేక్ లా మారింది దేవదాస్. ఇప్పటికే తెలుగులో కొన్ని మల్టీస్టారర్లు వచ్చినప్పటికీ నాగ్-నాని కాంబో మాత్రం చాలా ఫ్రెష్.

రీజన్ 2 – స్టోరీలైన్

ఇద్దరు పెద్ద స్టార్స్ కలవాలంటే స్టోరీలో ఎంత దమ్ముండాలో ఊహించుకోండి. అలాంటి రిచ్ కంటెంట్ ఉన్న స్టోరీనే దేవదాస్. ఈ సినిమాకి డైరెక్టర్ కూడా ఫిక్సవ్వక ముందే నాగ్ ని ఇంప్రెస్ చేసిన స్టోరీలైన్ ఇది. బాలీవుడ్ రైటర్ అందించిన కథను దర్శకుడు శ్రీరామ్ ఆదిత్య, మరికొంతమంది రైటర్స్ తో కూర్చుని ఈ కథను రెడీ చేశాడు. అందుకే ఈ స్టోరీపై భారీ అంచనాలున్నాయి.

రీజన్ 3 – హీరోయిన్లు

నాగ్, నాని కోసమే కాదు.. రష్మిక, అకాంక్ష సింగ్ కోసం కూడా దేవదాస్ సినిమాను చూడొచ్చు. ఎందుకంటే ఇద్దరూ హిట్ హీరోయిన్లే. గీతగోవిందం సినిమాతో హిట్ హీరోయిన్ల లిస్ట్ లో చేరిపోయింది రష్మిక. ‘మళ్ళీరావా’ సినిమాతో యూత్ ని కట్టిపడేసింది ఆకాంక్ష. ఇలాంటి ఇద్దరు ముద్దుగుమ్మలు కలిసి నటించిన సినిమా దేవదాస్. సినిమాపై ఈ రేంజ్ హైప్ క్రియేట్ అవ్వడానికి ఇది కూడా ఓ రీజన్.

రీజన్ 4 – మ్యూజిక్

ఇప్పటికే ఆల్బమ్ సూపర్ హిట్. దానికి తోడు ఈ సాంగ్స్ లిరికల్ వీడియోస్ లో అటాచ్ చేసిన స్టిల్స్, ఈ సాంగ్స్ విజువల్స్ ఎప్పుడెప్పుడు చూస్తామా..? అనే రేంజ్ లో క్యూరియాసిటీని జెనెరేట్ చేశాయి. మరీ ముఖ్యంగా వారు..వీరు… సాంగ్ తో పాటు ‘ఏమో ఏమో…’ సాంగ్ మ్యాగ్జిమం ఆడియెన్స్ ఫేవరేట్ లిస్టులో చేరిపోయాయి.

రీజన్ 5 – ప్రొడక్షన్ వాల్యూస్

టాలీవుడ్ కు భారీతనం, రిచ్ మేకింగ్ తీసుకొచ్చిన సంస్థ వైజయంతీ మూవీస్. అలాంటి సంస్థ నుంచి దేవదాస్ సినిమా వస్తుందంటే, ప్రొడక్షన్ వాల్యూస్ గురించి అస్సలు ఆలోచించనక్కర్లేదు. పైగా నాగార్జునకు ఇది హోం బ్యానర్ లాంటిది. అన్నింటికీ మించి మల్టీస్టారర్. సో.. ఖర్చుకు వెనకాడకుండా సినిమా నిర్మించారు నిర్మాత అశ్వనీదత్.

రీజన్ 6 – డైరక్షన్

భలే మంచి రోజు, శమంతకమణి లాంటి డిఫెరెంట్ ఎంటర్ టైనర్స్ తో మెస్మరైజ్ చేసిన శ్రీరామ్ ఆదిత్య ఈ సినిమాకు డైరక్టర్. అందుకే ఈ ‘దేవదాస్’ కూడా రొటీన్ కి భిన్నంగా ఉంటుందనే అంచనాలు ఆడియెన్స్ లో ఉన్నాయి.

రీజన్ 7 – సినిమాటోగ్రఫీ

దేవదాస్ యూనిట్ కు సంబంధించి తన నెక్ట్స్ సినిమా కోసం ఎవరినైనా సెలక్ట్ చేసుకోవాల్సి వస్తే సినిమాటోగ్రాఫర్ ను తీసుకుంటానని నాగార్జున చెప్పాడు. అంతలా సినిమాటోగ్రాఫర్ శ్యామ్ దత్ తనను ఇంప్రెస్ చేశాడని చెప్పుకొచ్చాడు. అదిరిపోయే ఫ్రేమ్స్, రిచ్ విజువల్స్ కోసమైనా దేవదాస్ చూడాలంటున్నాడు నాగ్.