నాగార్జున బర్త్ డే స్పెషల్

Thursday,August 29,2019 - 11:38 by Z_CLU

మన్మధుడు అనే పదానికి నిర్వచనం నాగ్. విక్రమ్ నుండి రీసెంట్ గా రిలీజైన ‘మన్మథుడు2’ వరకు నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రలు పోషించి, తెలుగు ఆడియెన్స్ గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఫ్యాన్స్ పల్స్ తెలిసిన కింగ్ నాగార్జున ఈ రోజు (ఆగస్ట్ 29) తన బర్త్ డే సెలెబ్రేట్ చేసుకుంటున్నాడు. ఈ 60 ఏళ్ల నవమన్మథుడిపై జీ సినిమాలు స్పెషల్ స్టోరీ…

1986 లో విక్రమ్ సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చిన నాగార్జున ఫస్ట్ సినిమాతోనే యాక్షన్ హీరో ఇమేజ్ ని సొంతం చేసుకున్నాడు. ఆ తరవాత రిలీజైన మజ్నుసినిమా నాగార్జున లోని మరో రొమాంటిక్ ఆంగిల్ ని ఎలివేట్ చేసింది. ఆ తరవాత రిలీజైన కలెక్టర్ గారి అబ్బాయిసినిమాతో కంప్లీట్ కమర్షియల్ హీరో అనిపించుకున్న నాగార్జున, బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫస్ట్ ఐదేళ్ళ కాలంలోనే ప్రొడ్యూసర్స్ ఫేవరేట్ హీరో అనిపించుకున్నాడు. ఈ పీరియడ్ లోనే రిలీజైన గీతాంజలినాగ్ కరియర్ లో ఆణిముత్యం అయితే, RGV డైరెక్షన్ లో తెరకెక్కిన శివనెక్స్ట్ జెనెరేషన్స్ కూడా మరిచిపోలేని రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసింది.

ప్రయోగాత్మక సినిమాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నాగార్జున సెల్యూలాయిడ్ సైంటిస్ట్అనిపించుకున్నాడు. ఓ వైపు రక్షణ, నిర్ణయం, కిల్లర్, అంతం, క్రిమినల్ లాంటి యాక్షన్ ఎంటర్ టైనర్స్ చేస్తూనే, మరో వైపు  హలోబ్రదర్, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, ఘరానా బుల్లోడు, రాముడొచ్చాడు, ఆవిడా మా ఆవిడే సినిమాలతో ఫ్యామిలీ ఆడియెన్స్ కి మరింత దగ్గరయ్యాడు.

అప్పటివరకు యూత్, మాస్, ఫ్యామిలీ జోనర్స్ లో ఆల్ రౌండర్ అనిపించుకున్న నాగార్జున అన్నమయ్యసినిమాతో ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాడు. అల్టిమేట్ యాక్షన్ ఎంటర్ టైనర్స్ తో స్టైలిష్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్న నాగార్జున కరియర్ లో అన్నమయ్యసినిమా పెద్ద ప్రయోగమే. ఈ సినిమాతో  తనలోని నట విశ్వరూపాన్ని ఎలివేట్ చేసిన నాగార్జున, మళ్ళీ ఇదే జోనర్ లో శ్రీ రామదాసు, షిర్డీ సాయి, ఓంనమో వెంకటేశాయ సినిమాలతో కంప్లీట్ యాక్టర్ అనిపించుకున్నాడు.

యాక్టర్ గా, ప్రొడ్యూసర్ గా సక్సెస్ లో పీక్ హైట్స్ కి రీచ్ అయిన కింగ్, రీసెంట్ గా మన్మథుడు-2తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. వయసు పెరుగుతున్నా తనలో గ్లామర్ ఏమాత్రం తరగలేదని ప్రూవ్ చేసుకున్నాడు. కింగ్ నాగ్ మరెన్నో సక్సెస్ ఫుల్ సినిమాలు చేయాలని, ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటుంది జీ సినిమాలు.