వైఎస్ బయోపిక్ లో స్టార్ హీరోహీరోయిన్లు

Wednesday,March 28,2018 - 06:51 by Z_CLU

యాత్ర పేరుతో త్వరలోనే సెట్స్ పైకి రానుంది వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర. ఇందులో వైఎస్ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించబోతున్నారు. ఇప్పుడీ ప్రాజెక్టు కోసం మరో ఇద్దరు స్టార్ హీరోహీరోయిన్లను తీసుకునే ప్లాన్ లో ఉంది యూనిట్.

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమాలో వైఎస్ కొడుకు వైఎస్ జగన్ పాత్ర కోసం హీరో సూర్యను సంప్రదించినట్టు తెలుస్తోంది. దర్శకుడు మహి వి రాఘవ్ ఇప్పటికే సూర్యను కలిసి స్టోరీలైన్ వినిపించాడట. ఇక మరో కీలకమైన పాత్ర కోసం కీర్తిసురేష్ ను అనుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికైతే ఇవి రూమర్స్ మాత్రమే. యూనిట్ నుంచి ఇంకా క్లారిటీ రాలేదు.

భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మ వంటి సూపర్ హిట్ సినిమాలను ప్రేక్షకులకి అందించిన 70ఎంఎం ఎంటర్టెన్మెంట్స్ బ్యానర్ పై నిర్మాతలు విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్న మూడో సినిమా ఇది. ఈ బయోపిక్ కథను దర్శకుడు మహి వి రాఘవ్ స్వయంగా రాసుకుని రూపొందిస్తున్నారు.

బ్యానర్ : 70 ఎమ్ ఎమ్ ఎంటర్ టైన్ మెంట్ప్

నిర్మాతలు : విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి

కథ, దర్శకత్వం : మహి వి రాఘవ్