ఇది కూడా పీరియాడిక్ డ్రామానే..?

Saturday,October 20,2018 - 02:58 by Z_CLU

మహేష్-సుకుమార్ కాంబోలో సినిమా రెడీ అవుతున్న విషయం తెలిసిందే. వన్-నేనొక్కడినే తర్వాత మహేష్ కు ఓ హిట్ బాకీ ఉన్నానని ప్రకటించిన సుకుమార్, అతడి కోసం ఓ కత్తిలాంటి సబ్జెక్ట్ రెడీ చేస్తున్నాడు. ఇందులో బాగంగా 1930ల నాటి సబ్జెక్ట్ ను మహేష్ కోసం సుక్కూ సిద్ధంచేసినట్టు తెలుస్తోంది.

1980ల నాటి బ్యాక్ డ్రాప్ తో రంగస్థలం సినిమా తీసి సూపర్ హిట్ కొట్టాడు సుకుమార్. ఇప్పుడు మహేష్ కోసం కూడా అదే ఫార్ములా ఫాలో అవుతున్నాడు. మహేష్ ఇప్పటివరకు ఇలాంటి పీరియాడిక్ సినిమాలో నటించలేదు.

ప్రస్తుతానికైతే ఈ కథకు మహేష్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అతడు న్యూయార్క్ లో మహర్షి సినిమా షూటింగ్ లో బిజీ. మరో 2 వారాల పాటు ఆ షెడ్యూల్ ఉంటుంది. ఇండియా వచ్చిన తర్వాత ఈ పీరియాడిక్ స్టోరీ విని Yes or No చెబుతాడు మహేష్.