తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 కలెక్షన్స్

Friday,May 19,2017 - 01:32 by Z_CLU

ప్రపంచవ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్న బాహుబలి-ది కంక్లూజన్ సినిమా, తెలుగు రాష్ట్రాల్లో తన డ్రీమ్ రన్ కొనసాగిస్తోంది. టాలీవుడ్ మార్కెట్ ను కొత్త ఎత్తులకు తీసుకెళ్తూ, కళ్లుచెదిరే వసూళ్లు రాబడుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఇప్పటికే వంద కోట్ల రూపాయల షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా తాజాగా ఆ నంబర్ ను ఇంకాస్త పెంచుకుంది.

విడుదలైన ఈ 20 రోజుల్లో బాహుబలి-2 సినిమాకు ఏకంగా 176.84 కోట్ల రూపాయల షేర్ వచ్చింది. మరి కొన్ని రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే ఏకంగా 200 కోట్ల రూపాయలు వసూలు చేయబోతోంది.

తెలుగు రాష్ట్రాల్లో 20 రోజుల షేర్…

నైజాం : 60.26

సీడెడ్ : 30.80

నెల్లూరు: 6.97

గుంటూరు : 16.10

కృష్ణ : 12.56

వెస్ట్ : 11.38

ఈస్ట్ : 15.57

ఉత్తరాంధ్ర : 23.20

మొత్తం ఈ 20 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో బాహుబలి 2 కలెక్ట్ చేసిన మొత్తం షేర్ 176. 84 కోట్లు.