ఫ్యాషన్ డిజైనర్ ప్రీ రిలీజ్ ఈవెంట్

Friday,May 19,2017 - 12:44 by Z_CLU

సీనియర్ డైరెక్టర్ వంశీ డైరెక్షన్ లో తెరకెక్కిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్ సినిమా విడుదలకు సిద్ధమైంది. వచ్చేనెల 2న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఈ గ్యాప్ లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటు చేసి సినిమాకు మంచి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. సుమంత్ అశ్విన్ హీరోగా నటించిన ఈ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 22న హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు.

గతంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘లేడీస్ టైలర్’కి సీక్వెల్ గా తెరకెక్కిన రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ ఈ ఫ్యాషన్ డిజైనర్. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. మరీ ముఖ్యంగా మణిశర్మ కంపోజ్ చేసిన బాణీలు, వంశీ ఫ్రేమ్స్ సినిమాపై అంచనాల్ని పెంచాయి.

మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై మధుర శ్రీధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్, మనాలీ రాధోడ్, మానస హీరోయిన్లుగా నటించారు. అప్పటి లేడీస్ టైలర్ రాజేంద్రప్రసాద్ కొడుకు ఇప్పుడేం చేస్తున్నాడు అనే కాన్సెప్ట్ తో ఈ సీక్వెల్ ను తెరకెక్కించారు.