చైనాలో 500 కోట్ల క్లబ్ లోకి దంగల్

Friday,May 19,2017 - 02:37 by Z_CLU

అమీర్  ఖాన్ నటించిన దంగల్ సినిమా చైనాలో 500 కోట్ల క్లబ్ క్రియేట్ చేసింది. ఓ ఇండియన్ సినిమాకు చైనాలో వంద కోట్లు రావడమే కష్టమనుకునే ఈ రోజుల్లో దంగల్ ఏకంగా 500 కోట్లు కలెక్ట్ చేసింది. అది కూడా జస్ట్ 13 రోజుల్లో కావడం విశేషం. ఇంకా ఈ సినిమా అక్కడ గట్టిగానే ఆడుతోంది.

చైనాలో కనీసం మరో 2 వారాల పాటు దంగల్ ఆడుతుందనే అంచనాలున్నాయి. ఎలా చూసుకున్నా ఈ సినిమా అక్కడ మరో 200 కోట్లు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది. సోమవారం, మంగళవారం అనే తేడాలేకుండా.. వీకెండ్స్ తో పాటు మిగతా రోజుల్లో కూడా దంగల్ వసూళ్లు  రాబడుతోంది. మరీ ముఖ్యంగా చైనాలోని గ్రామీణ ప్రాంతాలకు  ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది.

అటు తైవాన్ లో కూడా ఈ సినిమా మంచి వసూళ్లు సాధిస్తోంది. ఈ లెక్కలు కూడా కలుపుకుంటే వరల్డ్ వైడ్ వసూళ్లు ఇంకాస్త పెరుగుతాయి. తాజా వసూళ్లు నేపథ్యంలో త్వరలోనే మరోసారి చైనాలో పర్యటించే ఆలోచనలో ఉన్నాడు అమీర్ ఖాన్.