రాజమౌళి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Wednesday,April 26,2017 - 08:01 by Z_CLU

బాహుబలి-ది కంక్లూజన్ శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. మరి ఈ సినిమాపై దర్శకుడు రాజమౌళి వ్యూస్ ఏంటి.. ప్రస్తుతం జక్కన్న స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటి… ఈ సినిమా షూటింగ్ టైమ్ లో జరిగిన మరపురాని సంఘటనలు ఏమైనా ఉన్నాయా.. రాజమౌళి ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..

టెన్షన్ సహజమే…

నిజానికి వర్క్ చేస్తున్నప్పుడు చాలా ఎగ్జైట్మెంట్ గా ఫీలవుతాం.. ఆ వర్క్ అయిపోయి సినిమా రిలీజ్ కి దగ్గరపడుతున్నప్పుడు కాస్త టెన్షన్ మొదలవడం సహజమే.. ఇంకొంచెం వర్క్ ఉంటే బాగుండు కలిసి ఇంకొన్ని రోజులు వర్క్ చేస్తే బాగుండు అని ఫీలవుతున్నా..

సింహభాగం దానికే ఇస్తా

నిజానికి బాహుబలి సినిమా ఇంత పెద్ద విజయం సాధించడంలో సింహభాగం క్యారెక్టర్సే.. నాన్నగారు ఆ క్యారెక్టర్స్ గురించి చెప్తున్నప్పుడే ఒళ్లు పులకరించింది. ఆ క్యారెక్టరైజేషన్ లో బలమే సినిమాను ఈ స్థాయికి తీసుకెళ్లిందని నమ్ముతున్నా.

సీక్వెల్ అనుకోలేదు

నిజానికి ఈ సినిమా మొదలు పెట్టేటపుడు ఒకే సినిమాగా ట్రీట్ చేశాం. కానీ ఆ తర్వాత ఈ కథ రెండు గంటల్లో చెప్పలేం అనిపించింది. అలా షూటింగ్ టైమ్ లోనే ఈ కథను రెండు భాగాలుగా తెరకెక్కించాలనుకున్నాం.


మొదలుపెట్టేవాళ్ళమే కాదు

ఈ సినిమా కథ అనుకున్నప్పుడు గాని సెట్స్ పైకి వెళ్ళేటప్పుడు కానీ ఇన్నేళ్లు పడుతుందని, రెండు భాగాలుగా సినిమా చేస్తామని, ఇంత బడ్జెట్ అవుతుందని కానీ ఊహించలేదు.. అలా అనుకుంటే అసలు సినిమా మొదలుపెట్టేవాళ్ళమే కాదు.

ఆటంబాంబ్ లా పేలుతుందని ఊహించలేదు

నిజానికి బాహుబలి స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడ ఆపాలి అని చాలా ఆలోచించాం…ఒక కథ ని మధ్యలో ఆపడం ఆ కథ గురించి తెలుసుకోవాలనే క్యూరియాసిటీ ఆడియన్స్ లో కలిగించడం ఆషామాషీ వ్యవహారం కాదు. డిస్కషన్ లో ఒక ట్విస్ట్ ఉంటే బాగుంటుందనుకొని… కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడనే చిన్న ట్విస్ట్ తో ఎండ్ చేద్దామనుకున్న.. కానీ అది ఇంత పెద్ద ఆటం బాంబ్ లా పేలుతుందని ఇంటర్నేషనల్ ప్రశ్నగా మిగులుతుందని అస్సలు ఊహించలేదు.


అప్పుడే డబ్బులు అయిపోయాయి

సెకండ్ పార్ట్ కోసం కొన్ని హైలైట్స్ మిగల్చాలని ఎప్పుడూ అనుకోలేదు. ఏదీ కావాలని అలా ప్లాన్ చేయలేదు. రెండు భాగాలుగా తీద్దామని డిసైడ్ అవ్వగానే స్ట్రయిట్ నెరేషన్ చేద్దామనుకున్నాం. ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉండగానే చాలా ఆలోచించి కథ కు స్క్రీన్ ప్లే రాయడం జరిగింది..

అంత గ్యాప్ అనుకోలేదు

‘బాహుబలి ది బిగినింగ్’ సెట్స్ పైకి ఒక ప్రణాళికతో వెళ్ళాం..మొత్తం అంతా షూట్ చేసేసి పార్ట్ 1 రిలీజ్ అయిన 4 -5 నెలల్లో పార్ట్-2 ను రిలీజ్ చేయాలనుకున్నాం. కానీ మొదలుపెట్టాక డబ్బులన్నీ అయిపోయాయి. షూటింగ్ అవ్వలేదు ఇంకా ఫస్ట్ పార్ట్ రిలీజ్ చెయ్యాలి. అందుకే పార్ట్ 1 రిలీజ్ చేసేసి కాస్త టైం తీసుకొని పార్ట్ 2 ని సెట్స్ పైకి తీసువెళ్ళాం.

పోస్ట్ పోన్ చేద్దామా అని అడిగా

షూటింగ్ అయిపోయింది సీజీ వర్క్ ఇంకా జరుగుతుంది. రిలీజ్ డేట్ వరకూ షాట్స్ వస్తాయా..? రావా అనే టెన్షన్ మొదలైంది.. ఫుల్ టెన్షన్ వచ్చి రిలీజ్ కి 2 వారాల ముందు రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేద్దామా అని నిర్మాత శోభును అడిగా. అప్పుడు నువ్వు కంగారుపడకు అయిపోతుంది.. విల్ రీచ్ దిస్ డేట్ అన్నాడు.. అప్పుడు కొంచెం కూల్ అయ్యా..


అది కుదరదు

ఒక దర్శకుడు తన మైండ్ లో అనుకున్నది అనుకున్నట్లు 100 % తీయడం కుదరదు. కొన్ని ప్రాక్టికల్ గా వర్కవుట్ అవ్వవు. కానీ బాహుబలి విషయంలో నేను దర్శకుడిగా పూర్తిగా సంతృప్తి చెందాను. అనుకున్నది అనుకున్నట్టు తీయగలిగాను.

అప్పట్లోనే అద్భుతాలు సృష్టించారు

నిజానికి బాహుబలి తో మనం ఇంకాస్త పైకి వెళ్లి ఇంటర్నేషనల్ గా గుర్తింపు అందుకున్నాం కానీ తెలుగు సినిమా టెక్నీకల్ గా ఎప్పుడో ఎదిగింది. మాయాబజార్ సినిమా చూస్తుంటే అప్పుడే అద్భుతాలు తీసేశారనిపిస్తుంటుంది.. ఆ సినిమాలోని కొన్ని సీన్స్, విజువల్ ఎఫెక్ట్స్ చూస్తే కె.వి రెడ్డి గారు చాలా గొప్ప దర్శకులు అనిపిస్తుంది..

పదేళ్లు పట్టొచ్చు

అసిస్టెంట్ గా పనిచేస్తునప్పుడే ఒక డైరెక్టర్ అవ్వాలనుకున్నాను. డైరెక్షన్ లో ఇప్పుడు ఈ స్టేజ్ కి వచ్చా. ఇన్ని సినిమాలు తీసాను. ఇంకా పెద్దగా గోల్స్ అంటూ ఏంలేవు. కానీ ఎప్పటికైనా మహాభారతం తెరకెక్కించాలని ఉంది.. కానీ ఇప్పుడు ఆ ఓపిక, తీరిక రెండూ లేవు. ఆ సినిమా నేను అనుకున్నట్లు తెరకెక్కించాలంటే ఇంకో పదేళ్లు పట్టొచ్చు..


కచ్చితంగా ఉంటాయి

‘బాహుబలి ది బిగినింగ్’ చూసిన ప్రేక్షకులకు ఏ ప్రశ్నలైతే తలెత్తాయో.. ‘బాహుబలి ది కంక్లూజన్’ లో కచ్చితంగా సమాధానాలు దొరుకుతాయి.

‘బాహుబలి’ ఈ రోజు ఈ స్థాయికి రావడానికి కారకులు ఆ ముగ్గురే

బాహుబలి సినిమాగా తెరకెక్కడానికి దర్శకుడిగా నన్ను ప్రోత్సహించింది ముగ్గురే.. కథ అనుకోగానే మొదట నన్ను నమ్మి నువ్వు కచ్చితంగా చేస్తావ్ ఇదొక పెద్ద సినిమా అవుతుంది అని నన్ను ప్రోత్సహించింది నిర్మాతలు శోభు గారు, చిన్న గారే. ఆ తర్వాత ఈ సినిమా విషయంలో నన్ను వెనకుండి ముందుకు నడిపించింది నా కుటుంబమే.. ఇక బాహుబలి కథ చెప్పగానే నన్ను ప్రోత్సహించి ఒక బూస్టప్ ఇచ్చిన మూడో వ్యక్తి ప్రభాస్. కథ విని నువ్వు ఇక్కడ ఉండాల్సినోడివి కాదు. నువ్వు ఇంటర్నేషనల్ సినిమా తీయగలవు అని ప్రోత్సహించి ఇన్నేళ్లు నాతో ట్రావెల్ చేసిన ప్రభాస్ కి ఈ సందర్భంగా థాంక్స్.. అది చాలా చిన్న పదం అవుతుంది కూడా…

గర్వంగా ఫీలవుతున్నా

బాహుబలి ఒక స్టేజ్ నుంచి ఇండియన్ సినిమాగా ఇతర దేశాల్లో గుర్తింపు పొందడం ఫిలిం ఫెస్టివల్స్ లో మన తెలుగు సినిమాకి కూడా చోటు దొరకడం చాలా గర్వంగా ఫీలవుతున్నా.


నా అంత అదృష్టవంతుడు ఉండదు

ఒక సినిమా కోసం ఒక వ్యక్తి కష్టపడటం సహజమే. కానీ నా వెంటే ఉంటూ మా కుటుంబమంతా ఎంతో వెన్నుదన్ను గా నిలిచి బాహుబలి కోసం ఎంతో కష్టపడ్డారు.. వాళ్ళ ప్రోత్సాహం, సహకారంతోనే బాహుబలి సినిమా సాధ్యమైందని గట్టిగా నమ్ముతున్నా. ఆ విషయంలో నా అంత అదృష్టవంతుడు ఇంకొకడు ఉండదు అని ఫీలవుతుంటా..

డ్యూరేషన్ అంతే కానీ

బాహుబలి సినిమా డ్యూరేషన్ 2:41 గంటలే.. కానీ ఎండ్ టైటిల్స్, బిగినింగ్ థాంక్స్ కార్డు కలిపి 2 గంటల 50 నిముషాలు ఉంటుంది.. మా సినిమాకు పని చేసిన, సహకరించిన ప్రతీ ఒక్కరికి థాంక్స్ చెప్పుకోవడం మా బాధ్యత. సో అందుకే వాటికి కూడా ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది.