సోషల్ మీడియాలో 'సాహో' టీజర్

Wednesday,April 26,2017 - 01:00 by Z_CLU

ఒక వైపు ‘బాహుబలి-2’ సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ప్రేక్షకులు మరో వైపు ఈ సినిమా ఇంటర్వెల్ టైం లో రిలీజ్ కానున్న ‘సాహో’ టీజర్ గురించి కూడా ఎగ్జైటింగ్ గా వెయిట్ చేస్తున్నారు. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ నటిస్తున్న సినిమా పైగా 150 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కావడం తో ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. అయితే మరో రెండు రోజుల్లో బాహుబలి తో పాటు థియేటర్స్ లో రిలీజ్ కానున్న’సాహో’ టీజర్ ప్రెజెంట్ సోషల్ మీడియా లో హల్చల్ చేస్తుంది…

క్లారిటీ లేకపోయినప్పటికీ ఈ టీజర్ ను చూసేందుకు సోషల్ మీడియాలో ప్రేక్షకులు ఎగబడుతున్నారు.. మరి ఈ వీడియో ఎలా లీకైందో ఎవరు లీక్ చేసారో.. తెలియదు కానీ ప్రెజెంట్ ఈ టీజర్ మాత్రం సోషల్ మీడియా లో ట్రెండ్ అవుతూ హాట్ టాపిక్ గా మారింది. ఇక ఈ టీజర్ ను రేపు సాయంత్రం మొదట సోషల్ మీడియా లో రిలీజ్ చేసి బాహుబలి ప్రదర్శించే అన్ని థియేటర్స్ లో ఎల్లుండి నుంచి ప్రదర్శించడానికి సన్నాహాలు చేస్తున్నారట మేకర్స్.