Movie Review - 'ప్లే బ్యాక్'

Friday,March 05,2021 - 02:02 by Z_CLU

నటీనటులు: దినేష్ తేజ్, అనన్య నాగళ్ల ,స్పందన, అర్జున్ కళ్యాణ్, మాస్టర్ కార్తికేయ, అశోక్ వర్ధన్, సూర్య, టియన్ఆర్, TV5 మూర్తి, చక్రపాణి, ఐశ్వర్య లక్ష్మి, దీప్తి తదితరులు.

సంగీతం : కమ్రన్

సినిమాటోగ్రఫీ : బుజ్జి.కే

ఎడిటర్ : నాగేశ్వర రెడ్డి బొంతల

నిర్మాత : ప్రసాదరావు పెద్దినేని

రచన -దర్శకత్వం : హరి ప్రసాద్ జక్కా

నిడివి : 138 నిమిషాలు

విడుదల తేది : మార్చ్ 5 , 2021

టైం మిషన్ మీద తెలుగులో కొన్నేళ్ళ క్రితం ‘ఆదిత్య 369’ అనే సినిమా వచ్చింది. ఆ తర్వాత టైం మిషన్ మీద క్రాస్ టైం మీద పెద్దగా సినిమాలు రాలేదు. అందుకే తన రెండో సినిమాకు అలాంటి కాన్సెప్ట్ తీసుకొని ‘ప్లే బ్యాక్’ అనే సినిమా చేసాడు దర్శకుడు హరి ప్రసాద్ జక్కా. దినేష్ , అనన్య
జంటగా డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఈరోజే థియేటర్స్ లోకి వచ్చింది. మరి ఈ న్యూ కాన్సెప్ట్ ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.

play back movie telugu review 1
కథ :

న్యూస్ ఛానెల్ లో జర్నలిస్ట్ గా పనిచేసే కార్తీక్ (దినేష్ తేజ్) కొత్తగా ఓ అద్దె ఇంట్లోకి వెళతాడు. ఆ ఇంట్లో ఉండే పాత కాలం ల్యాండ్ ఫోన్ కి సుజాత(అనన్య నాగళ్ల) అనే అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటుంది. కార్తీక్ , సుజాత ఇద్దరు ఆ ఫోన్ ద్వారా తమకు సంబందించిన కొన్ని విషయాలు చెప్పుకుంటూ క్లోజ్ అవుతారు. అయితే రోజు తనతో మాట్లాడే సుజాత 1993 లో ఉండే ఓ అమ్మాయి అని తెలుసుకొని ఖంగు తింటాడు కార్తీక్. తనతో రోజు మాట్లాడే వ్యక్తి తనకంటే ముందు జరగబోయే ఫ్యూచర్ లో ఉన్నాడని తెలుసుకొని షాక్ అవుతుంది సుజాత. .

అయితే పాస్ట్ లో జరిగిన సుజాత మర్డర్ విషయం తెలుసుకున్న కార్తీక్ ఫ్యూచర్ ద్వారా సుజాత ను ఆ సంఘటన నుండి తప్పించాలనుకుంటాడు. ఈ క్రమంలో పాస్ట్ లో సుజాత ద్వారా కొన్ని మార్పులు చేయించే ప్రయత్నం చేస్తుంటాడు. ఇంతకీ కార్తీక్ ఎవరు ? కొన్నేళ్ళ క్రితం పుట్టిన సుజాత కి అతనికి ఏమైనా బంధం ఉందా ? ఫోన్ కనెక్షన్ ద్వారా పాస్ట్ లో జరిగే ఘటనను మార్చాలని చూసిన కార్తీక్ తను అనుకున్నట్లు మార్చగాలిగాడా ? అనేది మిగతా కథ.

 

నటీనటుల పనితీరు:

‘హుషారు’ సినిమాతో నటుడిగా ఆకట్టుకొన్న దినేష్ ఈ సినిమాలో హీరోగా ఫరవాలేదనిపించుకున్నాడు. కొన్ని సన్నివేశాల్లో నటుడిగా ఆకట్టుకున్నాడు. నటనకి స్కోప్ ఉండే సన్నివేశాల్లో మాత్రం మెప్పించలేకపోయాడు. 1993 టైంలో అమ్మాయిగా అనన్య తన నటనతో సినిమాకు ప్లస్ అయ్యింది. నటన కొత్త కావడంతో TV5 మూర్తి తన పాత్రకు పూర్తి న్యాయం చేయలేకపోయాడు. నారాయణగా TNR ఫరవాలేదు అనిపించాడు. హీరోయిన్ స్పందన ఓకె అనిపించుకుంది. మాస్టర్ కార్తికేయ బాగా నటించాడు.

సూర్య, ఆనంద చక్రపాణి, అర్జున్ కళ్యాణ్ , అశోక్ వర్ధన్ , ఐశ్వర్య ,దీప్తి మిగతా నటీ నటులంతా తమ క్యారెక్టర్స్ కి న్యాయం చేశారు.

 

సాంకేతిక వర్గం పనితీరు :

ఒక కొత్త కాన్సెప్ట్ తో తెరకెక్కె సినిమాకు టెక్నికల్ గా మంచి సపోర్ట్ అందాలి. ఈ సినిమా వరకు మ్యూజిక్ పరంగా కమ్రన్ , విజువల్స్ పరంగా కే బుజ్జి దర్శకుడికి మంచి సపోర్ట్ అందించారు. అలాగే జెవి ఆర్ట్ వర్క్ , నాగేశ్వర రెడ్డి బొంతల ఎడిటింగ్ బాగుంది. కొన్ని సందర్భాల్లో వచ్చే సౌండింగ్ మిక్సింగ్ మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.

హరిప్రసాద్ రాసుకున్న కథ కొత్తగా ఆసక్తిగా ఉంది. కాకపోతే కథనం ఇంకా బాగా రాసుకొని గ్రిప్పింగ్ గా తీసుంటే ఇంకా బెటర్ గా ఉండేది. ప్రొడక్షన్ వాల్యూస్ కథకు తగినట్టుగా ఉన్నాయి.

play back movie telugu review 1
జీ సినిమాలు సమీక్ష :

కొన్ని ఐడియాలు స్క్రిప్టింగ్ స్టేజిలో బాగుంటాయి. అలాంటి కథకు మంచి కథనం రాసుకొని స్క్రీన్ మీదకి తీసుకురావడం మాత్రం చాలా కష్టం. ఒకరకంగా చెప్పాలంటే అది కత్తి మీద సాములాంటి వ్యహారం. అందులోకి టైం క్రాస్ అనే సబ్జెక్ట్ డీల్ చేయడం అంటే ఆశామాషీ కాదు. దర్శకుడు హరి ప్రసాద్ తను రాసుకున్న పాయింట్ ని కన్విన్సింగ్ గా చెప్పే ప్రయత్నంలో అక్కడక్కడా తడబడ్డాడు. కొన్ని సన్నివేశాలు బాగానే హ్యాండిల్ చేసినప్పటికీ దర్శకుడిగా తనకున్న ఒక్క సినిమా అనుభవం, హరిప్రసాద్ కు చాల్లేదు. కథాపరంగా చూస్తే హాలీవుడ్ లో వచ్చిన ఫ్రీక్వెన్సీ సినిమాకి ‘ప్లే బ్యాక్’ కి కాస్త దగ్గర పోలిక ఉంటుంది. బహుశా దర్శకుడు ఆ సినిమాను ఆదర్శంగా తీసుకొని ఈ కథ సిద్దం చేసుకొని ఉండొచ్చు. ఇక సినిమా ఆరంభం నుండి చివరి వరకు సరికొత్త కథ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే కలుగుతుంది. కాకపోతే కథనం కాస్త నెమ్మదిగా సాగడంతో కొన్ని సార్లు బోర్ కొట్టిస్తుంది.

ఇలాంటి కథకి బలం చేకూర్చే నటీనటులను ఎంపిక చేసుకోవడం చాలా అవసరం. హరిప్రసాద్ ఈ సినిమాకు పెద్దగా అనుభవం లేని నటులను తీసుకోవడం వల్ల ఆ క్యారెక్టర్స్ క్లిక్ అవ్వలేదు. ఉన్నంతలో హీరోయిన్ అనన్య ఫరవాలేదు. మిగతా వాళ్లు క్యారెక్టర్స్ కి బెస్ట్ ఇవ్వలేకపోయారు. ఫోన్ కనెక్షన్ ద్వారా పాస్ట్ అండ్ ఫ్యూచర్ నుండి ఇద్దరు మాట్లాడుకోవడం, వాటిలో మార్పులు చేయాలనుకోవడం అనేది కొత్తగా అనిపిస్తుంది. 1993 లో లవ్ స్టోరీ ని బాగానే చూపించిన దర్శకుడు 2019 లవ్ ట్రాక్ తో మెప్పించలేకపోయాడు. ఫోన్ కన్వర్జేషన్ సన్నివేశాలు మాత్రం బాగున్నాయి. రొటీన్ సినిమాలు చూస్తూ తెలుగులో కొత్త కథలు రావా ? అనుకునే వారికి ‘ప్లే బ్యాక్’ మంచి ఆప్షన్. ఓవరాల్ గా దర్శకుడు హరిప్రసాద్ నుండి వచ్చిన ఈ సినిమా ఓ మంచి ప్రయత్నం అనొచ్చు.

రేటింగ్ : 2.5/ 5