సరికొత్త కాన్సెప్ట్ తో Play Back

Tuesday,March 02,2021 - 02:59 by Z_CLU

ప్రతీ వారం ఓ అరడజను సినిమాలు రిలీజవుతుంటాయి. వాటిలో కొన్ని కథలు మాత్రమే ప్రేక్షకులను కొత్తగా ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఈ శుక్రవారం అలాంటి ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ సినిమా రాబోతుంది. క్రాస్ టైం కాన్సెప్ట్ తో ఆడియన్స్ కి కొత్త అనుభూతి అందించబోతున్న ఆ సినిమానే ‘ప్లే బ్యాక్’. హరి ప్రసాద్ జక్కా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా మార్చ్ 5న థియేటర్స్ లోకి రానుంది.

పాస్ట్ అండ్ ఫ్యూచర్ మధ్య ఫోన్ కనెక్షన్ అనే ఎలిమెంట్ ని బేస్ చేసుకొని సరికొత్త కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాలో దినేష్ , అనన్య హీరో హీరోయిన్స్ గా నటించారు. ఇప్పటికే టీజర్ , ట్రైలర్ సినిమాపై బజ్ క్రియేట్ చేస్తూ డిఫరెంట్ సినిమా అనే ముద్ర వేశాయి. “పాస్ట్ లో వచ్చిన ఒక మార్పు వల్ల టైం ఫ్లో మారి కొత్త ప్రెజెంట్ కి చేరుకున్నాం” అంటూ ట్రైలర్ లో సూర్య క్యారెక్టర్ చెప్పే డైలాగ్ సినిమాలో ఉన్న మెయిన్ థీం పై ఆసక్తి కలిగించేలా ఉంది.

మరి ఈ న్యూ కాన్సెప్ట్ సినిమా ఆడియన్స్ కి ఎలాంటి ఎక్స్ పీరియన్స్ అందిస్తుందో ? బాక్సాఫీస్ దగ్గర ఎంత కలెక్ట్ చేస్తుందో వేచి చూడాలి.