PlayBack - ప్రజెంట్ లో పాస్ట్

Sunday,February 21,2021 - 11:36 by Z_CLU

హరిప్రసాద్ జక్కా దర్శకత్వంలో రాబోతున్న సినిమా “ప్లేబాక్”. సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కథా, కథనంతో వస్తున్నప్లేబాక్ అన్నీ కార్యక్రమాలను ముగించుకుని మార్చ్ 5 వ తేదీన థియేటర్ల లో విడుదలకు సిద్ధమవుతోంది.

ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలోనే ఇది సరికొత్త కథ అని చెబుతోంది టీం. క్రాస్ టైం కనెక్షన్ మీద ఇప్పటివరకు ఏ చిత్రం రాలేదని , కచ్చితంగా ఈ సినిమా ద్వారా ప్రేక్షకులకు నూతన కథా వస్తువు పరిచయం అవుతుందని అంటుంది.

శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ క్రియేషన్స్ పతాకం పై తెరకెక్కిన ఈ చిత్రంలో హుషారు సినిమా ఫేమ్ దినేష్ తేజ్ , మల్లేశం సినిమా ఫేమ్ అనన్య నాగళ్ల హీరో హీరోయిన్ లుగా నటించారు. అర్జున్ కళ్యాణ్ , స్పందన , మూర్తి , టీఎన్ ఆర్ , చక్రపాని , అశోక్ వర్ధన్, కార్తికేయ ప్రధాన పాత్రల్లో నటించారు.

హరిప్రసాద్ జక్కా ఇంతకుముందు వన్ నేనొక్కడినే కి కథను ఇవ్వడంతో పాటుగా , 100% లవ్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. అలాగే సుకుమార్ రైటింగ్స్ లో ”దర్శకుడు” అనే చిత్రానికి దర్శకత్వం వహించారు.