Movie Review - 'పవర్ ప్లే'

Friday,March 05,2021 - 02:03 by Z_CLU

నటీనటులు – రాజ్ త‌రుణ్‌, హేమ‌ల్, పూర్ణ‌, మ‌ధు నంద‌న్‌, అజ‌య్‌, కోటా శ్రీ‌నివాస‌రావు, రాజా ర‌వీంద్ర‌, ధ‌న్‌రాజ్‌, భూపాల్‌, త‌దిత‌రులు
క‌థ‌-మాట‌లు: న‌ంధ్యాల ర‌వి
సినిమాటోగ్ర‌ఫి: ఐ. ఆండ్రూ
సంగీతం: సురేష్ బొబ్బిలి‌
ఎడిటింగ్: ప‌్ర‌వీణ్ పూడి
బ్యానర్: వనమాలి క్రియేషన్స్
నిర్మాత‌లు: మ‌హిద‌ర్‌, దేవేష్‌
స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విజ‌య్ కుమార్ కొండా
సెన్సార్: U/A
రన్ టైమ్: 1 గంట 57 నిమిషాలు
రిలీజ్ డేట్: మార్చి 5, 2021

రీసెంట్ గా ఒరేయ్ బుజ్జిగా అంటూ పలకరించిన రాజ్ తరుణ్, ఇప్పుడో థ్రిల్లర్ తో మనముందుకొచ్చాడు. అటు దర్శకుడు విజయ్ కుమార్ కొండా తన కెరీర్ లో చేసిన మొదటి థ్రిల్లర్ ఇది. మరి పవర్ ప్లే టైటిల్ తో వచ్చిన ఆ సినిమా తన పవర్ చూపించిందా? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.

power play movie telugu review 1

కథ

విజయ్ (రాజ్ తరుణ్), కీర్తి (హేమల్) ప్రేమించుకుంటారు. పెళ్లికి కూడా రెడీ అవుతారు. పెద్దలు ఒప్పుకోకపోయినా పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అవుతారు. దీంతో పెద్దలు కూడా ఒప్పుకుంటారు. బ్యాచిలర్ పార్టీ ఇవ్వడానికి రెడీ అవుతాడు విజయ్. ఏటీఎంకు వెళ్లి డబ్బులు డ్రా చేస్తాడు. కానీ అలా వచ్చిన డబ్బంతా నకిలీ నోట్లే. దీంతో ఇన్ స్పెక్టర్ కరీమ్ (మధునందన్).. దొంగ నోట్ల కేసులో విజయ్ ను అరెస్ట్ చేస్తాడు. అదే రోజు పొద్దున్నే జరిగిన ఓ యాక్సిడెంట్ కేసులో డ్రగ్స్, ప్రముఖల పేర్లు బయటపడతాయి. ఆ న్యూస్ నుంచి మీడియాను డైవర్ట్ చేసేందుకు విజయ్ కేసును హైలెట్ చేస్తాడు కరీమ్.

ఈ క్రమంలో తను నిర్దోషినని నిరూపించుకునేందుకు ఏటీఎం దగ్గరున్న సీసీటీవీ ఫూటేజ్ కోసం ప్రయత్నిస్తాడు విజయ్. కానీ తన దొంగ నోట్ల కేసు కంటే పెద్ద కేసు ఒకటి ఆ ఫూటేజ్ లో బయటపడుతుంది. కాబోయే ముఖ్యమంత్రి పూర్ణ, ఆ ఫూటేజ్ లో ఉంటుంది. ఇంతకీ అందులో ఏముంది? విజయ్ తన కేసు నుంచి బయటపడ్డాడా లేదా అనేది బ్యాలెన్స్ కథ.

 

నటీనటుల పనితీరు

తొలిసారి ఫుల్ లెంగ్త్ థ్రిల్లర్ చేసిన రాజ్ తరుణ్ చాలా సీరియస్ గా కనిపించాడు. అలా సీరియస్ గా కనిపించడం కోసం తన మార్క్ ఎనర్జీని అతడు బలవంతంగా దాచుకోవాల్సి వచ్చింది. ఇక హీరోయిన్ హేమల్ యాక్టింగ్ కంటే రొమాన్స్ లో బాగా రాణించింది. ఫుల్ లెంగ్త్ విలన్ క్యారెక్టర్ చేసిన పూర్ణ తన పాత్రకు న్యాయం చేసింది. కొన్ని షేడ్స్ లో డ్రగ్ ఎడిక్ట్ గా కూడా కనిపించి మెప్పించింది. మధునందన్, అజయ్, కోటశ్రీనివాసరావు, రాజారవీంద్ర, భూపాల్ తమ పాత్రల మేరకు నటించారు.

టెక్నీషియన్స్ పనితీరు

టెక్నికల్ గా సినిమా చెప్పుకోదగ్గ స్థాయిలో లేదు. మరీ ముఖ్యంగా ఓ థ్రిల్లర్ సినిమాకు కావాల్సిన సరంజామా ఇందులో కనిపించదు. ఆండ్రూ సినిమాటోగ్రఫీ, సురేష్ బొబ్బిలి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యావరేజ్ గా ఉంది. ప్రవీణ్ పూడి ఎడిటింగ్ కూడా ఈసారి మెప్పించలేకపోయింది. వనమాలి క్రియేషన్స్ నిర్మాతలు లో-ప్రొడక్షన్ లో ఈ సినిమా తీశారు. దర్శకుడు విజయ్ కుమార్ కొండ డైరక్షన్ బాగున్నప్పటికీ.. స్క్రీన్ ప్లే ఆశించిన స్థాయిలో లేదు.

power play movie telugu review 1

జీ సినిమాలు సమీక్ష

థ్రిల్లర్ సినిమా తీయాలనుకున్నప్పుడు ఏ దర్శకుడైనా పాటించాల్సిన బేసిక్ పాయింట్ ఒకటే. స్క్రీన్ ప్లే చక్కగా రాసుకోవాలి. స్క్రీన్ ప్లే ఎంత పకడ్బందీగా ఉంటే సినిమా అంత గ్రిప్పింగ్ గా వస్తుంది. ఈ విషయంలో పవర్ ప్లే పెద్దగా ఆకట్టుకోదు. కచ్చితంగా ఓ థ్రిల్లర్ కు ఉండాల్సిన స్క్రీన్ ప్లే మాత్రం ఇది కాదు.

సినిమా స్టార్ట్ అవ్వడమే అదో రకంగా స్టార్ట్ అవుతుంది. ఎటు పోతుందో అర్థం కాదు. పబ్ లో రాజ్ తరుణ్ దొంగనోట్లతో దొరికిన తర్వాతైనా కథ పరుగులు పెడుతుందని ఆశించిన ప్రేక్షకుడు, ఇంకాసేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. చిక్కుముడులు వేయడానికి చాలా టైమ్ తీసుకున్న దర్శకుడు.. క్లైమాక్స్ కు వచ్చేసరికి వాటిని చకచకా విప్పేసి మమ అనిపించాడు. ఫస్ట్ టైమ్ థ్రిల్లర్ సినిమా తీసిన విజయ్ కుమార్ కొండా తన బలహీనతల్ని స్వయంగా తానే బయటపెట్టుకున్నట్టయింది.

ఈ కథకు కూడా సెల్ ఫోన్ ను వదల్లేదు దర్శకుడు. ఎప్పట్లానే పవర్ ప్లే సినిమాను సెల్ ఫోన్ చుట్టూ తిప్పాడు. అయితే ఎప్పట్లానే చిన్న చిన్న లాజిక్స్ విషయంలో మరోసారి దొరికిపోయాడు. సెల్ ఫోన్ ఓపెన్ చేయాలంటే సదరు ఫోన్ వాడుతున్న మనిషే అక్కర్లేదు. ఓ రిపేర్ షాపుకు వెళ్లినా ఓపెన్ చేసి పెడతారు.

ఈ సంగతి పక్కనపెడితే.. తన తొలి థ్రిల్లర్ మూవీకి మంచి పాయింట్ సెలక్ట్ చేసుకున్నాడు దర్శకుడు. దొంగనోట్లు, రాజకీయాలు, డ్రగ్స్ కేసు లాంటి ఎలిమెంట్స్ ను ఒకే థ్రెడ్ లోకి తీసుకొచ్చి చిక్కుముడులు బాగా వేశాడు. కాకపోతే ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఈ ముడులు వేయడానికి చాలా టైమ్ తీసుకున్న దర్శకుడు.. ఆ తర్వాత చకచకా ఒకేసారి అన్నింటినీ రివీల్ చేసి శుభం కార్డు వేసేశాడు. ప్రొడక్షన్ వాల్యూస్, సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ లాంటివేవీ ఈ సినిమాకు పెద్దగా కలిసిరాలేదు.

రాజ్ తరుణ్ సినిమా అంతా సీరియస్ గా కనిపిస్తాడు. అదేంటో.. హీరోయిన్ తో రొమాన్స్ చేస్తున్నప్పుడు కూడా అతడి ఎక్స్ ప్రెషన్ మారలేదు. హేమల్ ఓకే అనిపించుకోగా.. పూర్ణ మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. పోలీస్ గా నటించిన మధునందన్ కామెడీ చేస్తాడనుకుంటాం. కానీ అతడు కూడా ఓ ఛోటా విలన్ పాత్ర పోషించాడు.

ఓవరాల్ గా పవర్ ప్లే సినిమా ఉడికీ ఉడకని కూరలా అనిపిస్తుంది. అన్నీ సగం సగం మాత్రమే తగుల్తాయి.

బాటమ్ లైన్ – పవర్ లేని ప్లే
రేటింగ్ – 2.25/5