Micro Review - 'నిన్నిలా నిన్నిలా'

Saturday,February 27,2021 - 11:36 by Z_CLU

లవ్ , ఫుడ్ ఈ రెండూ మిక్స్ చేసి ఒక సినిమా తీస్తే ? ఎలా ఉంటుంది. అఫ్కోర్స్ మూవీ లవర్స్ తో పాటు ఫుడ్ లవర్స్ కూడా సినిమాను ఎంజాయ్ చేస్తారు. ఈ రెండు ఎలిమెంట్స్ తో కథను సిద్దం చేసుకొని ‘నిన్నిలా నిన్నిలా’ సినిమాను తెరకెక్కించాడు దర్శకుడు అనిల్ IV శశి. తను రాసుకున్న ప్రేమకథలో క్యారెక్టర్స్ కి పర్ఫెక్ట్ యాక్టర్స్ ను ఎంచుకొని ఓ సాఫ్ట్ సూతింగ్ ఫిలింను తీశాడు.

చిన్నతనం నుండి తనతో కలిసి స్నేహితురాలిగా పెరిగిన మాయ(నిత్యా మీనన్) ఉన్నపళంగా ఓ యాక్సిడెంట్ కి గురైయి చనిపోతుంది. ఆ బాధతో ఇండియా విడిచి లండన్ వెళ్లి చెఫ్ ఉద్యోగంలో చేరతాడు దేవ్(అశోక్ సెల్వన్). అక్కడ దేవ్ కుకింగ్ టాలెంట్, బెహేవియర్ చూసి అతని ప్రేమలో పడిన మరో అమ్మాయి తార(రీతు వర్మ). చివరకి దేవ్ జీవితంలో మాయమైన మాయ స్థానంలో తార ఎలా వచ్చింది అనేది సినిమా కథాంశం.

లండన్ లో ప్రారంభమైన సినిమాను మంచి ఫీల్ కలిగించే ప్రేమకథతో బాగానే తెరకెక్కించాడు దర్శకుడు శశి. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో పాటు దేవ్ ఫుడ్ ప్రిపేర్ చేసే సన్నివేశాలు, సత్య కామెడీ సినిమాకు ప్లస్ పాయింట్స్ అనొచ్చు. ముఖ్యంగా ఫ్లాష్ బ్యాక్ లో నిత్యామీనన్ క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ ఆకట్టుకుంటాయి.

ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో వచ్చే అశోక్ సెల్వన్ లుక్ బాగుంది. ఆ సందర్భంలో అశోక్ ఒకప్పటి మాధవన్ ను గుర్తుచేస్తాడు. సత్య కామెడీతో అలరించాడు. ఏ వంటకం అయినా ముక్కు వాసనతో టేస్ట్ గెస్ చేసే ఇంటర్నేషనల్ మాస్టర్ చెఫ్ గా నాజర్ నటన బాగుంది. గన్ తో కాల్చుకోవాలని చూసే సన్నివేశాలు నవ్వు తెప్పిస్తాయి. తార క్యారెక్టర్ లో రీతు వర్మ ఫరవాలేదనిపించుకుంది. కాకపోతే ఆమెకు నటించడానికి పెద్దగా స్కోప్ దొరకలేదు.

టెక్నీషియన్స్ విషయానికొస్తే దివాకర్ మణి విజువల్స్, రాజేష్ మురుగన్ మ్యూజిక్ ఫీల్ కలిగిస్తాయి. పాటలు వినసొంపుగా ఉన్నాయి. ఎడిటింగ్ ఫరవాలేదు. అనిల్ శశి ఎంచుకున్న కథ -కథనం రొటీన్ గానే అనిపిస్తాయి.

ఫైనల్ గా నిన్నిలా-నిన్నిలా సాఫ్ట్ లవ్ స్టోరీగా ఆకట్టుకుంటుంది. కాకపోతే సినిమా అంతా ఒకే మూడ్ లో వెళ్తూ కాస్త స్లో అనిపిస్తుంది. ఓవరాల్ గా స్లోగా సాగే ఈ ప్రేమకథ ఓకే అనిపిస్తుంది.

న‌టీన‌టులు: అశోక్ సెల్వ‌న్‌, నిత్యామీన‌న్‌, రీతూవ‌ర్మ, నాజర్‌  త‌దిత‌రులు

ద‌ర్శ‌క‌త్వం: అని.ఐ.వి.శ‌శి

నిర్మాత‌:  బీవీఎస్ఎన్‌.ప్ర‌సాద్, జీ స్టుడియోస్‌

స‌మ‌ర్ప‌ణ‌:  బాపినీడు.బి

సినిమాటోగ్ర‌ఫీ:  దివాక‌ర్ మ‌ణి

సంగీతం:  రాజేశ్ మురుగేశ‌న్‌

పాట‌లు:  శ్రీమ‌ణి

డైలాగ్స్‌:  నాగ చంద‌, అనుష‌, జ‌యంత్ పానుగంటి

ఎడిటింగ్‌:  న‌వీన్ నూలి

రిలీజ్: ఫిబ్రవరి 26, 2012

వేదిక: జీ ప్లెక్స్

రేటింగ్: 2.5/5