'ప్లే బ్యాక్'.... ఇంట్రెస్టింగ్ టీజర్

Wednesday,December 04,2019 - 02:51 by Z_CLU

ప్రస్తుతం ప్రేక్షకులు కొత్తదనం కోరుకుంటున్నారు. డిఫరెంట్ స్టోరీస్ తో వచ్చే సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే దర్శకుడు హరి ప్రసాద్ జక్కా ‘ప్లే బ్యాక్’ అంటూ ఓ డిఫరెంట్ స్క్రిప్ట్ తో వస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ గా టీజర్ రిలీజ్ చేసారు మేకర్స్.

ఓ ఇంట్లో ల్యాండ్ ఫోన్ రింగ్ అవ్వడం షాట్ తో మొదలైన టీజర్ లో కథ గురించి క్లుప్తంగా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు. ఇక టీజర్ లో హీరో , హీరోయిన్ మధ్య ఫోన్ టాక్ ను హైలైట్ చేసే షాట్స్ వేసి ఆ తర్వాత ఇరవై ఐదేండ్లయింది ఆ ఫోన్ డేడ్ అయి అంటూ దువ్వాసి మోహన్ తో డైలాగ్ చెప్పించి సస్పెన్స్ కి తెరలేపారు. “ఈ ఫోన్ పాస్ట్ ని ఫ్యూచర్ ని కలిపే ఒక పోర్టల్ గా పనిచేయడంతో ఆవిడతో నీకు కాంటాక్ట్ ఏర్పడింది“. “మీరు 1993 లో ఉన్నారు…. నేను మీ ఫ్యూచర్ లో 2019లో ఉన్నాను“.అనే డైలాగ్స్ తో సినిమా కథ ఏంటనేది క్లియర్ కట్ గా చెప్పారు. ఫైనల్ గా  “తెలంగాణా సీ.ఎం ఎవరు అని హీరో అడిగే ప్రశ్నకు .. తెలంగాణకి ఒకరు ఆంధ్రాకొకరు, రాయలసీమకి ఒకళ్ళు ఉంటారా? అందరికీ ఒక్కల్లె సీ.ఎం కే.విజయ భాస్కర్ రెడ్డి” అంటూ హీరోయిన్ ఆన్సర్ తో కాన్సెప్ట్ టీజర్ ను ముగించారు.

అలాగే టీజర్ లో క్రైం షాట్స్ తో  థ్రిల్లర్ ఎలిమెంట్స్ ను జోడించి సినిమాపై అంచనాలు నెలకొల్పారు. ముఖ్యంగా టీజర్ లో సినిమాటోగ్రఫీ , ఎఫెక్ట్స్ , మ్యూజిక్ ఆకట్టుకున్నాయి. ఓవరాల్ గా 1:06 సెకన్ల టీజర్ తో సినిమాపై ఆసక్తి రేకెత్తించడంలో దర్శకుడు హరి ప్రసాద్ సక్సెస్ అయ్యాడు.