Weekend Release - ఈవారం సినిమాలు

Thursday,March 04,2021 - 12:28 by Z_CLU

ఆల్రెడీ థియేటర్లలో ఉప్పెన, నాంది, చెక్ లాంటి సినిమాలు నడుస్తున్నాయి. ఇలాంటి టైమ్ లో ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 10 సినిమాలు థియేటర్లపై దండెత్తడానికి రెడీగా ఉన్నాయి. మరి వాటిలో బజ్ ఉన్న సినిమాలేవి? క్లిక్ అయ్యే కంటెంట్ అందులో ఉందో లేదో చూద్దాం

Sundeep Kishan 25th Film A1 Express Releasing On March 5

ఈ వీకెండ్ వస్తున్న సినిమాల్లో అంతోఇంతో బజ్ ఉన్న సినిమా ఏ1 ఎక్స్ ప్రెస్ మాత్రమే. యంగ్ అండ్ ఎనర్జిటిక్ సందీప్ కిషన్, బబ్లీ బ్యూటీ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన ఈ సినిమా కోసం ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాకో ప్రత్యేకత ఉంది. తెలుగులో వస్తున్న మొట్టమొదటి హాకీ బేస్డ్ మూవీ ఇదే. ట్రయిలర్ ఇప్పటికే హిట్టవ్వడం, సందీప్-లావణ్య పెయిర్ కు మంచి రెస్పాన్స్ రావడం ప్లస్ పాయింట్స్

ShaadiMubarak-teaser-zeecinemalu

ఇక ఏ1ఎక్స్ ప్రెస్ తర్వాత అంచనాలు పెంచుతున్న సినిమా షాదీ ముబారక్. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఓన్ చేసుకోవడంతో ఈ సినిమాపై అందరి కన్నుపడింది. బుల్లితెర స్టార్ సాగర్ హీరోగా నటించిన ఈ సినిమా కచ్చితంగా హిట్ అవుతుందంటున్నాడు రాజు. సినిమా ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్ అని చెబుతున్నాడు.

Raj Tarun Power Play Releasing March 5

ఈ రెండు సినిమాలు తప్పితే మిగతా సినిమాలపై పెద్దగా అంచనాల్లేవనే చెప్పాలి. హరిప్రసాద్ జక్కా తీసిన ప్లే బ్యాక్ అనే మూవీ క్రాస్-టైమ్ జానర్ లో నడుస్తుంది. ఈ సినిమా ట్రయిలర్ క్లిక్ అయింది కానీ బజ్ పెద్దగా లేదు. ఇక టాలీవుడ్ లో యష్ కున్న క్రేజ్ ను క్యాష్ చేసుకునేందుకు, అతడు ఐదేళ్ల కిందట చేసిన ఓ కన్నడ సినిమాను గజకేసరి పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. దీంతో పాటు విజయ్ సేతుపతి నటించిన ఓ తమిళ సినిమాను కూడా విక్రమార్కుడు పేరిట డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. అటు రాజ్ తరుణ్ నటించిన పవర్ ప్లే అనే సినిమా కూడా రేపే థియేటర్లలోకి వస్తోంది.

movie A

ఇక రాజేంద్రప్రసాద్ నటించిన క్లైమాక్స్, తారకరత్న, సురేష్ కొండేటి నటించిన దేవినేని సినిమాలతో పాటు.. తోటబావి, శ్రీ పరమానందయ్య శిష్యుల కథ, ”A” లాంటి సినిమాలు రేపు రిలీజ్ అవుతున్నాయి.