జీ సినిమాలు ( ఏప్రిల్ 12th)

Tuesday,April 11,2017 - 10:03 by Z_CLU

నటీనటులు : అక్కినేని నాగేశ్వర రావు, శ్రీదేవి

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, విజయ శాంతి, సత్యనారాయణ, నగేష్, చలపతి, చిట్టి బాబు, పండరి బాయ్ మరియు ఇతరులు

మ్యూజిక్ డైరెక్టర్ : చక్రవర్తి

డైరెక్టర్ : A. కోదండరామి రెడ్డి

ప్రొడ్యూసర్ : వెంకట్ అక్కినేని

రిలీజ్ డేట్ : 13 సెప్టెంబర్ 1983

అక్కినేని నాగేశ్వర రావు, శ్రీదేవి నటించిన పర్ఫెక్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ శ్రీరంగ నీతులు. కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ఇమోషనల్ సీక్వెన్సెస్ హైలెట్ గా నిలిచాయి.

=========================================================================

నటీనటులు: సుమన్, సంఘవి, కృష్ణంరాజు

ఇతర నటీనటులు : శివ కృష్ణ, శ్రీహరి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : కోటి

డైరెక్టర్ : బోయిన సుబ్బారావు

ప్రొడ్యూసర్ : డి . రామానాయుడు

రిలీజ్ డేట్ : 1996

సుమన్ హీరోగా అన్నదమ్ముల అనుబంధం అందంగా తెరకెక్కిన చిత్రం నాయుడు గారి కుటుంబం. ఈ సినిమాలో సీనియర్ యాక్టర్ రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇంపార్టెంట్ క్యారెక్టర్ లో నటించారు. కోటి అందించిన సంగీతం సినిమాకి ప్రధాన ఆకర్షణ.

==============================================================================

నటీ నటులు : నాగార్జున అక్కినేని, నయన తార

ఇతర నటీనటులు : మీరా చోప్రా, K. విశ్వనాథ్, ఆశిష్ విద్యార్థి, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, ఆలీ, M.S. నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : S.S. తమన్

డైరెక్టర్ : దశరథ్

ప్రొడ్యూసర్ : D. శివ ప్రసాద్ రెడ్డి

రిలీజ్ డేట్ : 3 మే 2013

దశరథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ గ్రీకు వీరుడు. ఒంటరిగా విదేశాల్లో పెరిగి, కుటుంబమంటే ఏంటో తెలియని యువకుడిగా నాగార్జున నటన సినిమాకే హైలెట్. నయన తార అసలు నాగార్జున జీవితంలోకి ఎలా అడుగు పెడుతుంది. ఆ తరవాత వారిద్దరి జీవితం ఎలాంటి మలుపులు తిరుగుతుందనేదే ప్రధాన కథాంశం. ఈ సినిమాకి S.S. తమన్ సంగీతం అందించాడు.  

=========================================================================== 

నటీనటులు : శ్రీహరి, రాజా, గజాల, నిఖిత

ఇతర నటీనటులు : బాలాదిత్య, ముకేష్ రిషి, జయప్రకాశ్ రెడ్డి, రంగనాథ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : మణి శర్మ

డైరెక్టర్ : మల్లికార్జున్

ప్రొడ్యూసర్ : శివకుమార్

రిలీజ్ డేట్ : 6 మార్చి 2008 

భద్రాది అనేది అమలాపురం దగ్గర ఒక చిన్న పల్లెటూరు. ఎప్పుడూ పచ్చటి పొలాలతో కళకళలాడుతూ ఉండే భద్రాద్రి ONGC వల్ల వచ్చే గ్యాస్ వల్ల, అక్కడి వాతావరణం కాలుష్యం అయి, దాదాపు స్మశానం లా  తయారవుతుంది. అప్పుడు రఘు రామ్ ( శ్రీ హరి ) ఏం చేశాడు..? తన ఊళ్ళో పరిస్థితులు బాగు చేయడానికి శ్రీహరి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడు అనేదే ప్రధాన కథాంశం.

=============================================================================

హీరోహీరోయిన్లు  – నితిన్, మమతా మోహన్ దాస్

నటీనటులు సింధు తులాని, అశుతోష్ రానా, శశాంక్, దువ్వాసి మోహన్, బ్రహ్మానందం,అలీ

సంగీతం చక్రి

బ్యానర్ ఆర్.ఆర్. మూవీ మేకర్స్

దర్శకత్వం రవి. సి. కుమార్

విడుదల 2008, జూన్ 27

ల్యాండ్ మాఫియా నేపథ్యంలో నితిన్ నటించిన సినిమా విక్టరీ. 2008లో నితిన్ మూడు సినిమాలు చేస్తే అందులో ఒకటి విక్టరీ. అశుతోష్ రానా విలన్ గా నటించిన ఈ సినిమాలో మమతా మోహన్ దాస్ ఎప్పీయరెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఓ తెలివైన కుర్రాడు తన బలంతో పాటు తెలివితేటలతో ల్యాండ్ మాఫియాను ఎలా అడ్డుకున్నాడనేదే ఈ సినిమా స్టోరీ.

==============================================================================

నటీనటులు : జీవా, నయనతార

ఇతర నటీనటులు : పశుపతి, ఆశిష్ విద్యార్థి, కరుణాస్, రాజేష్, అజయ్ రత్నం, చరణ్ రాజ్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీకాంత్ దేవ

డైరెక్టర్ : S.P. జగన్నాథన్

ప్రొడ్యూసర్ : R.B.చౌదరి

రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

బాధ్యతా రాహిత్యంగా తిరిగే ఒక మాస్ కుర్రాడు, ఒక బార్ డ్యాన్సర్ జ్యోతిని కలుసుకుంటాడు. అతని గతాన్ని తెలుసుకున్న జ్యోతి, చిన్నగా అతనికి జీవితమంటే ఏంటో, దాని విలువేంటో తెలియజేసే ప్రయత్నం చేస్తుంటుంది. ఇంతలో వారికి తెలిసిన ఒక నిజం ఇద్దరి జీవిత లక్ష్యాన్నే  మార్చేస్తుంది. జీవా, నయనతార నటించిన సినిమా రిలీజైన అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్టయింది.

============================================================================

నటీనటులు : నిశ్చల్, వందన, R.P. పట్నాయక్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, దువ్వాసి మోహన్, అనిత చౌదరి

మ్యూజిక్ డైరెక్టర్ : R.P. పట్నాయక్

డైరెక్టర్ : R.P. పట్నాయక్

ప్రొడ్యూసర్ : R.P. పట్నాయక్

రిలీజ్ డేట్ : 11 మార్చి 2016

 ఫార్ములా సినిమాలకు భిన్నంగా ఉంటాయి R.P. పట్నాయక్ సినిమాలు. హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన తులసీదళం 2016 లో రిలీజైన బెస్ట్ సినిమాలలో ఒకటి. సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్స్ లో నటిస్తూనే, ఈ  సినిమాకి దర్శకుడు, నిర్మాత, సంగీతం అన్ని తానాయి చూసుకున్నాడు R.P. పట్నాయక్.