వరుణ్ తేజ్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ

Tuesday,April 11,2017 - 05:52 by Z_CLU

ఏప్రిల్ 14 న రిలీజ్ కానుంది మిస్టర్. ఫుల్ ఫ్లెజ్డ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న వరుణ్ తేజ్ ఈ సినిమాకి సంబంధించిన విషయాలే కాదు, తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా చాలా ఇంటరెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు.

చాలా ట్రావెల్ చేశాం

 మిస్టర్ ఒక ట్రావెల్ లవ్ స్టోరీ. జస్ట్ స్తోరీనే కాదు ఈ సినిమా షూటింగ్ కోసం కూడా చాలా చాలా ట్రావెల్ చేశాం. కేరళ నుండి మొదలుపెడితే, ఇటలీ, స్పెయిన్, స్విట్జర్ లాండ్ డిఫెరెంట్ డిఫెరెంట్ ప్లేసెస్ లో, స్టోరీ డిమాండ్ ని బట్టి ట్రావెల్ చేస్తూనే ఉన్నాం. ఈ ప్రాసెస్ లో అందరం ఫ్యామిలీ లా కలిసిపోయాం.

పక్కా ట్రయాంగిల్ లవ్ స్టోరీ

మిస్టర్ ప్రేమ పంచుతూ ఉంటాడు. అలా అందరికీ ప్రేమ పంచే మిస్టర్ ప్రేమ వెదుక్కుంటూ వెళ్ళడమే కాన్సెప్ట్. పక్కా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. ఇందులో మిస్టర్ కి, మిస్టర్ తో పాటు హీరోయిన్ ఇద్దరికీ ఒక బ్యాక్ స్టోరీ ఉంటుంది. అదీ కాకుండా ఇద్దరు హీరోయిన్స్, హీరోకి మధ్య జరిగే రొమాంటిక్ జర్నీ ఈ సినిమా మెయిన్ ప్లాట్.

శ్రీనువైట్ల కొత్తగా చేసిందేమీ లేదు

శ్రీను వైట్ల ఇలాంటి క్యూట్ లవ్ స్టోరీలు బిగినింగ్ లోనే చేసేశాడు. ఆనందం, సొంతం ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన ఇలాంటి కాన్సెప్ట్స్ ఆల్ రెడీ హ్యాండిల్ చేసి ఉన్నారు. కాబట్టి ఆయన ఈ సినిమాతో కొత్తగా ట్రై చేసిందేమీ లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఆయన రియల్. టేస్ట్ ఇదే.

మిస్టర్ తర్వాత…

ఈ సినిమా ఆతర్వాత శేఖర్ కమ్ముల గారితో ఫిదా సినిమా ఉంటుంది. ఈ సినిమా చేసేటప్పుడు కాలికి దెబ్బ తగలడంతో షెడ్యూల్స్ డిస్టబ్ అయ్యాయి. ఇక ఫిదా తర్వాత ఇమ్మీడియట్ గా ఇంకో సినిమా ఉంటుంది వెంకీ అట్లూరితో.

నా సినిమాల్లో ఆల్ టైం ఫేవరేట్

మనసుకు నచ్చిన సినిమా కంచె. ఫస్ట్ మూవీ ముకుందపై డెఫ్ఫినేట్ గా ఆ ఎఫెక్షన్ ఉంటుంది కానీ, కంచె మాత్రం ఆల్ టైం ఫేవరేట్ గా ఉండిపోతుంది. ఆ సినిమా నాకెప్పటికీ స్పెషల్ గా ఉండిపోతుంది.

అస్సలు రిస్క్ అనిపించలేదు

మహా అయితే ఆయన లాస్ట్ రెండు సినిమాలు ఫెయిల్యూర్స్. అలాంటివి నాకు కొత్త కాదు. మా ఫ్యామిలీలోనే అలాంటి సక్సెస్ లు ఫెయిల్యూర్స్ చాలా చూశాను. అంతెందుకు నా ఫస్ట్ సినిమా ఆడలేదు, థర్డ్ మూవీ ఆడలేదు… శ్రీను గారు తలుచుకుంటే బెస్ట్ స్టార్ ని పిక్ చేసుకోవచ్చు.. కానీ ఆయన యంగ్ టీమ్ తో చేద్దామనుకున్నారు… అందుకే నన్ను చూజ్ చేసుకున్నారు…

సక్సెస్ కాలేదు కానీ చాలా ఇచ్చింది

ముకుంద సినిమాని చాలా ఎక్స్ పెక్ట్ చేసి చేశాను, ఎంతైనా అది నాకు ఫస్ట్ మూవీ.. కానీ రిలీజయ్యాక ఎక్స్ పెక్ట్ చేసినంత రెస్పాన్స్ రాలేదు… ఒక మాటలో చెప్పాలంటే సినిమా సక్సెస్ కాలేదు, కానీ బోలెడంత రెస్పెక్ట్ దొరికింది. దాంతో పాటు ఒక నిజం తెలిసి వచ్చింది. ఏంటంటే.. సినిమా చూజ్ చేసుకోవడం వరకే మన చేతిలో ఉంటుంది. ఆ తర్వాత ఏం జరగబోతుంది అనేది మన చేతుల్లో ఉండదు. మనకు ఇచ్చిన పని మనం 100% చేస్తున్నామా లేదా అదొక్కటే మనం చూసుకోవాలి.

నాన్నగారి ఇన్వాల్వ్ మెంట్ అసలుండదు

నాన్నగారు నేను చాలా డిస్కస్ చేసుకుంటాం కానీ ఎప్పుడూ ఆయన తన అభిప్రాయాల్ని టేస్ట్ ని నాపై రుద్దరు. ఆయనకో కథ నచ్చితే కనీసం రిఫర్ కూడా చేయరు. ఆయనకు నచ్చిన కథ నాకు నచ్చకపోతే నేను దానికి 100% ఇవ్వలేను అని ఆయన ఫీలింగ్. అదే నిజం కూడా. అందుకే ఆయన ఇన్వాల్వ్ అవ్వరు… నా డెసిషన్స్ పై ఆయనకు చాలా నమ్మకం.

వినగానే చేసేయాలనిపించింది

లవ్ స్టోరీ చేద్దాం అనే మోడ్ లో ఉన్నప్పుడు చెప్పారు శ్రీను వైట్ల గారు ఈ సినిమాని. మనం ప్రేమను వెదుక్కుంటూ వెళ్తే, ప్రేమ మనల్ని  వెదుక్కుంటూ వస్తుంది. అదే ఈ సినిమాకి బేస్ లైన్. సినిమా మొత్తం ఈ లైన్ ఫ్లోట్ అవుతూనే ఉంటుంది. ఆయన ఒక్కో ఎలిమెంట్ ఎక్స్ ప్లేన్ చేస్తుంటే, అప్పటికపుడు ఈ సినిమా నేను చేయాల్సిందే అనిపించింది.

ఎంత అవసరమో అంతే ఉంటుంది

నా బాడీ లాంగ్వేజ్ కి హెవీ డ్యాన్స్ సూట్ అవ్వదు. అలాగని రిక్వైర్ మెంట్ ఉన్నప్పుడు కంపల్సరీగా నాకు తగ్గట్టు, ఎంతవరకు ఉండాలో అంతవరకు కంపోజ్ చేసిన స్టెప్సే ఉంటాయి.  షూటింగ్ ముందే చాలా ప్రాక్టీస్ చేశాను కాబట్టి కొన్ని హెవీ స్టెప్స్ ఉన్నా చాలా ఈజీ అనిపించింది.

పెదనాన్న దగ్గర చనువెక్కువ

ఇంట్లో పెద్ద నాన్న దగ్గర చాలా చనువెక్కువ. ఇక మా యంగ్ జెనెరేషన్ లో అయితే ప్రతీది చెర్రీ తో షేర్ చేసుకుంటాను.

అందరి ఫ్యాన్స్ కోసం సినిమా చేస్తా

ఫ్యాన్సే సినిమాకి పెద్ద సపోర్ట్. అందుకే జస్ట్ నా ఫ్యాన్స్ కోసం సినిమా చేయను. ఏ స్టార్ ఫ్యాన్స్ అయినా తమ ఫేవరేట్ స్టార్ సినిమాలే కాదు వేరే స్టార్ సినిమాలు కూడా చూస్తారు. అందుకే అందరికీ నచ్చే సినిమా చేయాలి. అందర్నీ థియేటర్స్ కి రప్పించాగలగాలి. అదే మైండ్ లో పెట్టుకుని సినిమా చేస్తాను. అల్టిమేట్ గా సినిమా ఆడుతుందనిపిస్తే చేసేస్తాను.

ఇప్పట్లో కుదరడం లేదు

నాన్న ప్రొడక్షన్ లో సినిమా ఉంటుంది. ఆల్రెడీ నేను కూడా అడుగుతున్నాను. ఈలోపు తక్కిన ప్రాజెక్ట్స్ లైనప్ అయ్యేసరికి టైం పడుతుంది. కానీ డెఫ్ఫినేట్ గా నాన్న ప్రొడక్షన్ లో సినిమా ఉంటుంది.

ఫిదా మ్యాగ్జిమం కంప్లీట్ అయినట్టే…

ఫిదా ఆల్ మోస్ట్ 75% అయిపోయింది. మిస్టర్ రిలీజ్ తరవాత మళ్ళీ రెగ్యులర్ షూటింగ్ కంటిన్యూ అవుతుంది. ఓ 20 రోజుల్లో షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఆక్చువల్ గా ఆ సినిమాకి , ఈ సినిమాకి స్పేస్ ఉండాలనే ఫిదాకి గ్యాప్ ఇస్తున్నాం.

క్రిష్ తో మళ్ళీ సినిమా ఎప్పుడు..?

మళ్ళీ క్రిష్ తో సినిమా అంటే.. ఇప్పట్లో చెప్పలేం, ఆయన ప్రస్తుతం హిందీ సినిమా మేకింగ్ లో బిజీగా ఉన్నారు. నాకూ ఓ రెండు మూడు కమిట్ మెంట్స్ ఉన్నాయి. ఆ తరవాత అన్నీ కుదిరితే తప్పకుండా ఉంటుంది.

గీతా ఆర్ట్స్ లో సినిమా ఎప్పుడు ..?

అరవింద్ గారితో పాటు నేను కూడా వెయిటింగ్. మొన్న బన్నీ బర్త్ డే టైమ్ లో కూడా ఈ డిస్కషన్ వచ్చింది. మంచి స్టోరీ దొరకాలి కానీ, గీతా ఆర్ట్స్ ఒక్కటే కాదు,  కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్ లో కూడా సినిమా ఉంటుంది.

యంగ్ మెగా మల్టీ స్టారర్ ఎప్పుడు..?

మెగా యంగ్ జెనరేషన్ నుండి మల్టీ స్టారర్ అంటే నిజానికి ఇప్పుడు అందరం బిజీగా ఉన్నాం. అప్పుడప్పుడు కలిసినప్పుడు కూడా ఆన్ గోయింగ్ ప్రాజెక్స్ట్ గురించి మాట్లాడుకోవడం, ఫ్యామిలీ హాలీడేస్, అకేషన్స్ గురించి తప్ప మల్టీ స్టారర్స్ గురించి పెద్దగా డిస్కషన్స్ రాలేదు. కానీ ఫ్యూచర్ లో కంపల్సరీగా ఉంటుంది.