జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,November 17,2019 - 10:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

ఇటివలే ‘నిను వీడను నీడను నేనే’ అంటూ హారర్ థ్రిల్లర్ తో సందడి చేసిన సందీప్ కిషన్ ఇప్పుడు ‘తెనాలి రామకృష్ణ BABL’అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. నాగేశ్వర్ రెడ్డి డైరెక్షన్ లో ఫన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాతో సందీప్ హిట్ అందుకున్నాడా ? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఓన్లీ యాక్షన్.. విశాల్ కొత్త సినిమా ట్యాగ్ లైన్ ఇదే. టైటిల్ కూడా ఇదే. ఇలా పూర్తిగా యాక్షన్ నే నమ్ముకొని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా విశాల్ కు సక్సెస్ అందించిందా..? జీ సినిమాలు ఎక్స్ క్లూజివ్ రివ్యూ.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రవితేజ హీరోగా, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలైంది. అంతా ఊహించినట్టే ఈ సినిమాకు క్రాక్ (KRACK) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హీరోయిన్ శృతిహాసన్, ఓపెనింగ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

తన కొత్త సినిమా నుంచి మూడో పాట వస్తుందని చెప్పిన బన్నీ, సాంగ్ టీజర్ మాత్రం రిలీజ్ చేశాడు. ఫుల్ సాంగ్ 22న వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆ టీజర్ లోనే బన్నీ చెప్పిన సస్పెన్స్ ఉంది. అవును.. ఈ టీజర్ లో బన్నీ కొడుకు అయాన్, కూతురు అర్హ నటించారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మరో డిఫరెంట్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నాడు సూర్య. సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.