రవితేజ "క్రాక్" మొదలైంది

Thursday,November 14,2019 - 12:23 by Z_CLU

రవితేజ హీరోగా, గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో కొత్త సినిమా మొదలైంది. అంతా ఊహించినట్టే ఈ సినిమాకు క్రాక్ (KRACK) అనే టైటిల్ ఫిక్స్ చేశారు. హీరోయిన్ శృతిహాసన్, ఓపెనింగ్ లో స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.

హైదరాబాద్ లో ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ కొట్టగా, పరుచూరి వెంకటేశ్వరరావు కెమెరా స్విచాన్ చేశారు. ఫస్ట్ షాట్ ను రాఘవేంద్రరావు డైరక్ట్ చేయగా, బౌండెడ్ స్క్రిప్ట్ ను సురేందర్ రెడ్డి అందించాడు.

ఈ సినిమాలో పోలీస్ గా కనిపించబోతున్నాడు రవితేజ. అయితే రెగ్యులర్ గా కనిపించే పోలీస్ కు భిన్నంగా, రౌడీలకే రౌడీగా కనిపించబోతున్నాడు. అందుకే ఈ సినిమాకు క్రాక్ అనే టైటిల్ పెట్టారు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.

యదార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కనున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. ఓవైపు సినిమాను లాంఛ్ చేయడంతో పాటు.. టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ ను కూడా ఇదే రోజు విడుదల చేశారు.