ఆకాశమే నా హద్దు అంటున్న సూర్య

Monday,November 11,2019 - 12:21 by Z_CLU

రకరకాల జానర్స్ ట్రై చేస్తున్నాడు. కానీ సరైన రిజల్ట్ అందుకోలేకపోతున్నాడు. తాజాగా వచ్చిన బందోబస్త్ సినిమా కూడా నిరాశపరిచింది. ఇలాంటి టైమ్ లో మరో డిఫరెంట్ సబ్జెక్ట్ సెలక్ట్ చేసుకున్నాడు సూర్య. సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దీనికి ఆకాశం నీ హద్దురా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

సూర్యకు 2డీ ఎంటర్ టైన్ మెంట్స్ అనే బ్యానర్ ఉన్న సంగతి తెలిసిందే. తన సినిమాలకు సంబంధించి అప్పుడప్పుడు సహ-నిర్మాతగా మాత్రమే వ్యవహరించిన సూర్య.. ఈ సినిమాతో పూర్తిస్థాయి ప్రొడ్యూసర్ గా కూడా మారాడు.

అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. గురు చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్నారు సుధాకొంగర. ఆ మూవీ తర్వాత ఈమె చేస్తున్న సినిమా ఇదే. త్వరలోనే మూవీ టీజర్ రిలీజ్ చేస్తారు.