అల వైకుంఠపురములో సర్ ప్రైజ్ ఇదే

Thursday,November 14,2019 - 11:49 by Z_CLU

సర్ ప్రైజ్ అంటూ ఊరించిన బన్నీ ఎట్టకేలకు సస్పెన్స్ రివీల్ చేశాడు. తన కొత్త సినిమా నుంచి మూడో పాట వస్తుందని చెప్పిన బన్నీ, సాంగ్ టీజర్ మాత్రం రిలీజ్ చేశాడు. ఫుల్ సాంగ్ 22న వస్తుందని క్లారిటీ ఇచ్చాడు. అయితే ఆ టీజర్ లోనే బన్నీ చెప్పిన సస్పెన్స్ ఉంది.

అవును.. ఈ టీజర్ లో బన్నీ కొడుకు అయాన్, కూతురు అర్హ నటించారు. వాళ్లిద్దరిపై తీసిన చిన్న వీడియోను మూడో సాంగ్ టీజర్ గా రిలీజ్ చేశారు. ఓ మై గాడ్ డాడీ అనే లిరిక్స్ తో సాగే ఈ సాంగ్ కూడా క్యాచీగా ఉంది. ఇప్పటికే విడుదలైన 2 పాటలకు పూర్తి భిన్నంగా కూడా ఉంది.