జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,November 10,2019 - 10:02 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

విభిన్న కథలతో సినిమాలు చేస్తూ హీరోగా ఒక రెస్పెక్ట్ తెచ్చుకున్న శ్రీ విష్ణు ఇప్పుడు ‘తిప్పరా మీసం’ అంటూ థియేటర్స్ లోకొచ్చాడు. మాస్ ఎలిమెంట్స్, ఎమోషనల్ కంటెంట్ తో తెరకెక్కిన ఈ సినిమాతో శ్రీ విష్ణు మీసం తిప్పి హిట్టు కొట్టాడా.. జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

సూపర్ స్టార్ రజినీకాంత్, స్టార్ డైరెక్ట‌ర్ ఏఆర్‌మురుగదాస్‌ల ఫ‌స్ట్ క్రేజి కాంబినేష‌న్‌లో రూపొందుతున్న ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం `దర్బార్`. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.సుభాస్కరన్ అత్యంత భారీ బడ్జెట్‌తో, హైటెక్నిక‌ల్ వాల్యూస్‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రజనీకాంత్‌ ఒక ప‌వ‌ర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న‌ సినిమాను అన్ని రకాల కమర్షియల్ హంగులతో మురుగదాస్ తెరకెక్కిస్తున్నారు. తాజాగా దర్బార్ మూవీ తెలుగు మోషన్ పోస్టర్‌ని సూపర్ స్టార్ మహేష్  విడుద‌ల చేశారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్ -రష్మిక జంటగా తెరకెక్కుతున్న ‘భీష్మ’ సినిమాకు సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ పేరిట ఓ వీడియో రిలీజ్ చేశారు. నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిది. కనిపిస్తుంది కానీ క్యాచ్ చేయలేం.ఇలా ఓ క్యాచీ డైలాగ్ తో ప్రారంభమైంది ‘భీష్మ’ ఫస్ట్ లుక్ వీడియో. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రిపబ్లిక్ డే & మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు కానుకగా జనవరి 24న  “డిస్కో రాజా” విడుదలకి రెడీ అవుతుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ ఎక్కువుగా ఉండటంతో, ఎక్కడా కాంప్రమైస్ కాకుండా క్వాలిటీ అవుట్ పుట్  కోసమే డిస్కోరాజాను డిసెంబర్ 20 నుంచి జనవరి 24కి వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి, దర్శకుడు వి ఐ ఆనంద్ తెలిపారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.