డిస్కో రాజా రిలీజ్ పోస్ట్ పోన్

Friday,November 08,2019 - 09:35 by Z_CLU

రిపబ్లిక్ డే & మాస్ మహారాజా రవితేజ పుట్టినరోజు కానుకగా జనవరి 24న  “డిస్కో రాజా” విడుదలకి రెడీ అవుతుంది. ఈ చిత్రంలో గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ పార్ట్ ఎక్కువుగా ఉండటంతో, ఎక్కడా కాంప్రమైస్ కాకుండా క్వాలిటీ అవుట్ పుట్  కోసమే డిస్కోరాజాను డిసెంబర్ 20 నుంచి జనవరి 24కి వాయిదా వేస్తున్నట్లుగా నిర్మాత రామ్ తళ్లూరి, దర్శకుడు వి ఐ ఆనంద్ తెలిపారు.
ఇదిలా ఉంటే నవంబర్ 18తో లాస్ట్ షెడ్యూల్ షూటింగ్ ముగించి డిసెంబర్ మొదటి వారంలో డిస్కోరాజా టీజర్ ను రిలీజ్ చేసేందుకు ఈ మూవీ టీం ప్లాన్ చేస్తుంది.

న‌టీన‌టులు
ర‌వితేజ‌, ‌పాయ‌ల్ రాజ‌పుత్, నభా నటేష్, సునీల్, తాన్యా హోప్, బాబీ‌సింహా, వెన్నెల‌ కిషోర్, స‌త్య‌ త‌దిత‌రులు

సాంకేతిక వ‌ర్గం
బ్యానర్ : ఎస్ ఆర్ టి ఎంట‌ర్ టైన్మెంట్స్
ప్రొడక్షన్ – రామ్ తళ్లూరి
సమర్పణ – సాయి రిషిక
నిర్మాత : రజని త‌ళ్లూరి
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : విఐ ఆనంద్
సినిమాటోగ్రాఫ‌ర్  : కార్తీక్ ఘట్టమనేని
డైలాగ్స్ : అబ్బూరి రవి
మ్యూజిక్ : థ‌మన్. ఎస్
ఎడిట‌ర్ : న‌వీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్ : నాగేంద్ర. టి
కో డైరెక్టర్స్ : విజయ్ కామిశెట్టి, సురేష్ పరుచూరి