భీష్మ ఫస్ట్ గ్లింప్స్.. ప్రేమ కోసం ఆరాటం

Thursday,November 07,2019 - 11:32 by Z_CLU

నా లవ్ కూడా విజయ్ మాల్యా లాంటిది. కనిపిస్తుంది కానీ క్యాచ్ చేయలేం.
ఇలా ఓ క్యాచీ డైలాగ్ తో ప్రారంభమైంది భీష్మ ఫస్ట్ లుక్ వీడియో. వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఈరోజు ఫస్ట్ గ్లింప్స్ పేరిట ఓ వీడియో రిలీజ్ చేశారు. ఈరోజు త్రివిక్రమ్ పుట్టినరోజు. అందుకే ఈ వీడియో ఈరోజు రిలీజైంది.

రష్మిక వెంటపడుతున్న నితిన్ విజువల్స్ ను వీడియోలో చూపించారు. రష్మికను గ్లామరస్ గా, నితిన్ ను రొమాంటిక్ గా ప్రజెంట్ చేసిన ఈ వీడియో. మహతి స్వరసాగర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఈ వీడియోతో పాటు రిలీజ్ డేట్ కూడా అఫీషియల్ గా ప్రకటించారు. ఫిబ్రవరి 21న భీష్మ థియేటర్లలోకి వస్తోంది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు సూర్యదేవర నాగవంశీ నిర్మాత. సాయిశ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించగా.. సాహి సురేష్ ఆర్ట్ వర్క్ చేశాడు. కంప్లీట్ కామెడీ రొమాంటిక్ యాంగిల్ లో తెరకెక్కుతోంది భీష్మ