షూటింగ్ అప్ డేట్స్

Sunday,November 10,2019 - 11:04 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘జాన్'(వర్కింగ్ టైటిల్) సినిమా మరో షెడ్యుల్ నవంబర్ 18 నుండి రామోజీ ఫిలిం సిటీలో మొదలు కానుంది. ఫిలిం సిటీలో వేసిన భారీ సెట్ లో కొన్ని కీలక సన్నివేశాలు తీయనున్నారు. గోపికృష్ణ మూవీస్ & యూ.వీ.క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. అమిత్ త్రివేది మ్యూజిక్ కంపోజర్.


బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. డిసెంబర్ ఫస్ట్ వీక్ నాటికి సినిమాను పూర్తి చేయాలని టార్గెట్ గా పెట్టుకున్నారు. ప్రస్తుతం పారిస్ లో షూటింగ్ జరుగుతోంది. సామజవరగమన పాటను పారిస్ లోని అందమైన లొకేషన్లలో షూట్ చేస్తున్నారు. శేఖర్ మాస్టర్ ఈ పాటకు కొరియోగ్రాఫర్. వచ్చే ఏడాది జనవరి 12న సంక్రాంతి కానుకగా సినిమా విడుదలవుతుంది.


నందమూరి కల్యాణ్‌రామ్‌, మెహరీన్‌ జంటగా సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ ఎమోషనల్ ఎంటర్టైనర్ ‘ఎంత మంచి వాడవురా’ షూటింగ్ పూర్తయింది. కేరళలోని మున్నార్‌ తదితర సుందరమైన ప్రదేశాల్లో అక్టోబర్ 31 నుంచి నవంబర్‌ 9 వరకూ జరిగిన షెడ్యుల్ తో టోటల్ షూట్ పూర్తయింది.
శ్రీదేవి మూవీస్‌ శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఆదిత్యా మ్యూజిక్‌ బ్యానర్ పై ఉమేష్‌ గుప్తా, సుభాష్‌ గుప్తా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 15న సంక్రాంతి కానుకగా విడుదలవుతుంది.


నాని, సుధీర్ బాబు హీరోలుగా నటిస్తున్న ‘V’ సినిమా షూటింగ్ దాదాపు పూర్తికావొచ్చింది. సినిమాకు సంబంధించి 80శాతం షూటింగ్ పూర్తయినట్టు యూనిట్ ప్రకటించింది. ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చ్ 25 న థియేటర్స్ లోకి రానుంది.


ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్న ’90ml’ తాజాగా అజర్ బైజాన్ లో భారీ షెడ్యూల్ పూర్తి చేసుకుంది. 8 రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో 3 పాటలు పిక్చరైజ్ చేశారు. దీంతో సినిమా షూటింగ్ మొత్తం కంప్లీట్ అయింది. కార్తికేయ క్రియేటివ్‌ వర్క్ సంస్థ నిర్మిస్తోన్న ఈ సినిమాలో నేహా సోలంకి హీరోయిన్ గా నటిస్తోంది. శేఖర్ రెడ్డి ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు.