జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,April 07,2019 - 10:02 by Z_CLU

కొన్ని హాట్ న్యూస్ లు ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న వార్తలేంటి.. టాలీవుడ్ లో ఈ వీక్  లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

పెళ్లి తర్వాత నాగచైతన్య-సమంత కలిసి సినిమా చేయడం, ‘నిన్ను కోరి’ లాంటి సూపర్ హిట్ తర్వాత శివ నిర్వాణ డైరెక్షన్ , టీజర్, ట్రైలర్ ఎట్రాక్ట్ చేయడం…. ఇవన్నీ కలిసి ‘మజిలీ’ ను స్పెషల్ మూవీ చేసాయి. మరి రియల్ లైఫ్ భార్య భర్తలు రీల్ లైఫ్ భార్యభర్తలుగా మరో సారి మేజిక్ చేసారా..? మజిలీ చైతు కి హిట్ అందించిందా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న వెంకీ మామ సినిమాకు సంబంధించి టైటిల్ లోగో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు వెంకీ మామ అనే టైటిల్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే టైటిల్ పై సస్పెన్స్ లేదు. సింపుల్ గా లోగో మాత్రం రిలీజ్ చేశారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

నాగార్జున, రకుల్ ప్రీత్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న మన్మధుడు-2 సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తిచేసుకుంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఫ్యామిలీ ఎపిసోడ్ సీన్స్ పిక్చరైజ్ చేశారు. ఈ షెడ్యూల్ లో హీరోహీరోయిన్లతో పాటు కొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టులు పాల్గొన్నారు.పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మల్టీస్టారర్ ఆర్-ఆర్-ఆర్ షూటింగ్ ఆగిపోయింది. రామ్ చరణ్ గాయపడడంతో ఈ సినిమా షూటింగ్ ను నిలిపివేస్తున్నట్టు యూనిట్ ప్రకటించింది. నిన్న జిమ్ లో వర్కవుట్ చేస్తూ గాయపడ్డాడు చరణ్. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి