రామ్ చరణ్ కు గాయం.. ఆగిపోయిన RRR షూటింగ్

Wednesday,April 03,2019 - 04:55 by Z_CLU

రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా వస్తున్న మోస్ట్ ఎవెయిటింగ్ మల్టీస్టారర్ ఆర్-ఆర్-ఆర్ షూటింగ్ ఆగిపోయింది. రామ్ చరణ్ గాయపడడంతో ఈ సినిమా షూటింగ్ ను నిలిపివేస్తున్నట్టు యూనిట్ ప్రకటించింది. నిన్న జిమ్ లో వర్కవుట్ చేస్తూ గాయపడ్డాడు చరణ్.

గాయం నుంచి కోలుకోవడానికి కాస్త టైమ్ పడుతుంది. అందుకే సినిమా షూటింగ్ ను రద్దుచేశారు. తిరిగి 3 వారాల తర్వాత ఆర్-ఆర్-ఆర్ పూణె షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది.

350 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది ఆర్-ఆర్-ఆర్ మూవీ. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాను రాజమౌళి డైరక్ట్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది జులై 30న సినిమాను రిలీజ్ చేస్తారు