వెంకీమామ టైటిల్ లోగో ఇదే

Friday,April 05,2019 - 04:36 by Z_CLU

వెంకటేశ్, నాగచైతన్య హీరోలుగా నటిస్తున్న వెంకీ మామ సినిమాకు సంబంధించి టైటిల్ లోగో రిలీజ్ చేశారు. ఈ సినిమాకు వెంకీ మామ అనే టైటిల్ పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. అందుకే టైటిల్ పై సస్పెన్స్ లేదు. సింపుల్ గా లోగో మాత్రం రిలీజ్ చేశారు.

లోగో డిజైన్ బాగుంది. మరీ ముఖ్యంగా లోగోకు ఒకవైపు గ్రామీణ నేపథ్యం, మరోవైపు యుద్ధం థీమ్ పెట్టారు. ఈ రెండు అంశాల మధ్య ఈ సినిమా నడుస్తుందనే విషయం అర్థమౌతోంది. మరీ ముఖ్యంగా సినిమాలో మిలట్రీ బ్యాక్ డ్రాప్ ఏదో ఉందనే విషయం లోగో చూస్తే తెలుస్తోంది.

మూవీ ఫస్ట్ షెడ్యూల్ ఇప్పటికే స్టార్ట్ అయింది. సోమవారం నుంచి సెకెండ్ షెడ్యూల్ ప్రారంభం అవుతుంది. ఆగస్ట్ నాటికి షూటింగ్ పూర్తిచేసి, దసరా కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు. మూవీలో వెంకీ సరసన పాయల్, చైతూ సరసన రాశిఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు.