బన్నీ లిస్టు పెరిగిపోతుంది

Sunday,April 07,2019 - 11:15 by Z_CLU

అల్లు అర్జున్  డైరెక్టర్స్ లిస్టు రోజుకురోజుకు పెరిగిపోతుంది. ప్రస్తుతం త్రివిక్రమ్ తో ఒక సినిమా ఆ వెంటనే సుకుమార్ తో మరో సినిమా కమిట్ అయ్యాడు బన్నీ. వీరిద్దరూ కాకుండా మరో వైపు తమిళ దర్శకుడు మురుగదాస్ తో కూడా ఓ సినిమా ఉంటుందనే టాక్ నడుస్తోంది. ఇవే కాకుండా గీతా ఆర్ట్స్ లో మరో డైరెక్టర్ తో  సినిమా ఉందంటున్నారు. అయితే ఇప్పుడు బన్నీ లిస్టు లోకి వేణు శ్రీరామ్ కూడా చేరాడు.

ఇటివలే MCAతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ వేణు శ్రీరామ్ లేటెస్ట్ గా బన్నీ కి ఓ కథ వినిపించి గ్రీన్ సిగ్నల్ అందుకున్నాడట. ఈ సినిమాను దిల్ రాజు నిర్మించనున్నాడని తెలుస్తోంది. సో త్రివిక్రమ్ , సుకుమార్ తర్వాత బన్నీ వేణు శ్రీరామ్ తోనే  సినిమా చేసే ఛాన్స్ ఉంది.