జీ సినిమాలు ( 5th ఆగష్టు )

Saturday,August 04,2018 - 10:30 by Z_CLU

భేతాళుడు

నటీనటులు : విజయ్ ఆంటోని, అరుంధతి నాయర్

ఇతర నటీనటులు : Y  . G మహేంద్ర, మీరా కృష్ణన్, కిట్టి, చారు హాసన్, సిద్ధార్థ శంకర్ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : విజయ్ ఆంటోని

డైరెక్టర్ : ప్రదీప్ కృష్ణమూర్తి

ప్రొడ్యూసర్ : ఫాతిమా విజయ్ ఆంటోని

రిలీజ్ డేట్ : 1  డిసెంబర్ 2016

ఓ సాఫ్ట్ వేర్ కంపెనీ లో సాఫ్ట్ వేర్ గా పనిచేసే దినేష్(విజయ ఆంటోనీ) ఒక అనాధ గా జీవితాన్ని కొనసాగిస్తున్న ఐశ్వర్య(అరుంధతి నాయర్) ను పెళ్లిచేసుకుంటాడు. పెళ్ళైన తరువాత దినేష్ కు ఓ భయంకరమైన గొంతు వినపడుతూ వేధిస్తుంది.. గతజన్మ కు సంబంధించిన జ్ఞాపకాలు గుర్తుకు రావడం. జయలక్ష్మి అనే మహిళ తనను గత జన్మలో చంపిందంటూ ఆ గొంతుతో వినబడుతూ ఉంటుంది. ఇంతకీ ఆ గొంతు ఎవరిది? ఐశ్వర్య ను పెళ్లి చేసుకున్న తరువాత దినేష్ ఎలాంటి సంఘటనలు ఎదుర్కొన్నాడు? అసలు జయలక్ష్మి ఎవరు? గతజన్మలో దినేష్ ఎవరు? అనేది సినిమా ప్రధాన కథాంశం.

==============================================================================

తులసి

నటీనటులు : వెంకటేష్, నయనతార

ఇతర నటీనటులు : రమ్యకృష్ణశ్రియ, మాస్టర్ అతులిత్, ఆశిష్ విద్యార్థి, రాహుల్ దేవ్, శివాజీ, జయ ప్రకాష్ రెడ్డి తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : బోయపాటి శ్రీను

ప్రొడ్యూసర్ : D. సురేష్ బాబు

రిలీజ్ డేట్ : 12 డిసెంబర్ 2007

వెంకటేష్, నయనతార జంటగా నటించిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ తులసి. బోయపాటి డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా రిలీజైన ప్రతి సెంటర్ లోను సూపర్ హిట్టయింది. సెంటిమెంట్, యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి. రమ్యకృష్ణ క్యారెక్టర్ సినిమాకి ప్లస్.

==============================================================================

బుజ్జిగాడు

నటీనటులు : ప్రభాస్, త్రిష కృష్ణన్

ఇతర నటీనటులు : మోహన్ బాబు, సంజనా, కోట శ్రీనివాస రావు, M.S. నారాయణ, సునీల్, బ్రహ్మాజీ మరియు తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : సందీప్ చౌతా

డైరెక్టర్ : పూరి జగన్నాథ్

ప్రొడ్యూసర్ : K. S. రామారావు

రిలీజ్ డేట్ : 23 మార్చి 2008

ప్రభాస్, త్రిష జంటగా నటించిన అల్టిమేట్ యాక్షన్ లవ్ ఎంటర్ టైనర్ బుజ్జిగాడు. పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన్ బాబు కీ రోల్ ప్లే చేశారు. ప్రభాస్ డిఫెరెంట్ మ్యానరిజం సినిమాకి హైలెట్ గా నిలిచింది.

==============================================================================

యోగి

నటీనటులు : ప్రభాస్, నయనతార

ఇతర నటీనటులు : కోట శ్రీనివాస రావు, ప్రదీప్ రావత్, సుబ్బరాజు, ఆలీ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రమణ గోగుల

డైరెక్టర్ : V.V. వినాయక్

ప్రొడ్యూసర్ : రవీంద్ర నాథ్ రెడ్డి

రిలీజ్ డేట్ : 12 జనవరి 2017

ప్రభాస్ హీరోగా V.V. వినాయక్ డైరెక్షన్ లో తెరకెక్కిన హై ఎండ్ ఇమోషనల్ ఎంటర్ టైనర్ యోగి. నయనతార హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఊర్వశి శారద ప్రభాస్ కి తల్లిగా నటించారు. ఈ ఇద్దరి మధ్యన నడిచే ఇమోషనల్ సీన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

సుడిగాడు

నటీనటులు : అల్లరి నరేష్, మోనాల్ గజ్జర్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆలీ, M.S. నారాయణ, రఘుబాబు, వేణు మాధవ్, చంద్ర మోహన్, చలపతి రావు, ధర్మవరపు సుబ్రహ్మణ్యం తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : శ్రీ వసంత్

డైరెక్టర్ : భీమనేని శ్రీనివాస రావు

ప్రొడ్యూసర్ : చంద్రశేఖర్ D రెడ్డి

రిలీజ్ డేట్ : 24 ఆగష్టు 2012

అల్లరి నరేష్ నటించిన స్పూఫ్ కామెడీ చిత్రం సుడిగాడు. భీమనేని శ్రీనివాస రావు డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా పక్కా కామెడీ ఎంటర్ టైనర్ అనిపించుకుంది. అల్లరి నరేష్,  బ్రహ్మానందం కాంబినేషన్ లోని కామెడీ సీన్స్ సినిమాకే హైలెట్.

=============================================================================

అహ నా పెళ్ళంట

నటీనటులు : అల్లరి నరేష్, శ్రీహరి, రీతు బర్మేచ

ఇతర నటీనటులు : అనిత హాసనందిని, బ్రహ్మానందం, ఆహుతి ప్రసాద్, సుబ్బరాజు, విజయ్ సామ్రాట్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : రఘు కుంచె

డైరెక్టర్ : వీరభద్రం

ప్రొడ్యూసర్ : అనిల్ సుంకర

రిలీజ్ డేట్ : 2 మార్చి 2011

రియల్ స్టార్ శ్రీహరి, నరేష్ కాంబినేషన్ లో తెరకెక్కిన హిలేరియస్ ఎంటర్ టైనర్ అహ నా పెళ్ళంట. వీరభద్రం డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అన్ని సెంటర్ లలోను సూపర్ హిట్ అయింది. కామెడీ సినిమాకి పెద్ద ఎసెట్.